రెండు భాగాలుగా బన్నీ – లోకేష్ కనగరాజ్ మూవీ..?

Kumar NA

Web Stories

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కలయికలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే వదిలిన అనౌన్స్ మెంట్ వీడియో సోషల్ మీడియానే షేక్ చేసింది. ముఖ్యంగా ఈ వీడియోకి అనిరుద్ ఇచ్చిన బీజీయం ఫ్యాన్స్ ను ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ కాంబోలో రాబోయే సినిమా ఏకంగా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట.

లోకేష్ కనకరాజ్ తన సినిమాలన్నింటినీ ఒకదానికొకటి లింక్ చేస్తూ ‘LCU’ పేరుతో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా ఈ యూనివర్స్‌లో భాగమా లేక ఒక ప్రత్యేకమైన సబ్జెక్టా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ, లోకేష్ రాసుకున్న కథ పరిధి చాలా పెద్దదిగా ఉండటంతో, దీనిని రెండు భాగాలుగా తీయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. బన్నీ స్టైల్, లోకేష్ మార్క్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లోకేష్ సిద్ధం చేసిన స్క్రిప్ట్ చాలా నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. కథలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఇవ్వాలంటే ఒకే భాగంలో సరిపోదని మేకర్స్ భావిస్తున్నారట.

‘పుష్ప’తో అల్లు అర్జున్ రేంజ్ పాన్-ఇండియా స్థాయికి చేరింది. ఇలాంటి తరుణంలో రెండు భాగాలుగా సినిమా వస్తే బిజినెస్ పరంగా కూడా భారీ లాభాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, అంటే 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.ఈ సినిమాను టాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా నిలుస్తుందని సమాచారం.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos