బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) చేస్తున్న లేటెస్ట్ మూవీకి ‘కిష్కింధపురి’ (kishkindhapuri) అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కు ఇది 11వ సినిమా. ఈ మూవీతో కౌశిక్ పెగళ్లపాటి అనే నూతన దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను సాహు గారపాటి నిర్మించారు. లేటెస్ట్‌గా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను గురించిన గ్లింప్స్ ఈ నెల 29న విడు దల అవుతుంది.
‘రాక్షసుడు’ మూవీ తర్వాత అనుపమాపరమేశ్వరన్, బెల్లకొండ సాయిశ్రీనివాస్ మరోసారి జంటగా ఈ సినిమా కోసం కలిసి నటిస్తున్నారు. ‘రాచ్చసన్’ తమిళ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ‘రాక్షసుడు’ సినిమా అప్పట్లో ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. మళ్లీ ఆ తరహా హిట్ మ్యాజిక్ ‘కిష్కింధపురి’ సినిమా కోసం రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
ఇక ‘కిష్కింధపురి’ అనేది సినిమాలో కల్పిత గ్రామంలా ఉంటుందట. కథలో కోతులు ప్రముఖ పాత్రలో కనిపిస్తాయి. ఫుల్ హారర్ ఫిల్మ్ ఇది. నైట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా రోజుల క్రితమే ఈ మూవీని స్టార్ట్ చేశారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్, నైట్ షూట్స్, అనుపమా పరమేశ్వరన్ కాల్షీట్స్…వంటి కారణాల చేత రిలీజ్ ఆలస్యమౌతోంది. ఇప్పుడు రిలీజ్‌కు టైమ్ దగ్గరపడింది. గ్లింప్స్‌లో రిలీజ్‌డేట్‌ను ప్రకటించవచ్చు.
‘కిష్కింధపురి’ కాకుండ మరో మూడు కొత్త సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. వాటిలో ఒకటి తమిళ గరుడన్‌కు తెలుగు రీమేక్ ‘భైరవం’. మైథలాజికల్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హైంధవ’, యాక్షన్ ఫిల్మ్ ‘టైసన్ నాయుడు’ ఉన్నాయి. అన్నీ సవ్యంగా సాగితే బెల్లకొండ సాయిశ్రీనివాస్ చేసిన మరో రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కావొచ్చు. కొంతకాలంగా హిట్ సినిమా లేక ఇబ్బందిపడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు వీటిలో హిట్ ఇచ్చే సినిమా ఏది అవుతుందో చూడాలి.