please subscribe to Tollywoodhub YouTube channel

వెంకీ సినిమా క్యాన్సిలైందా?

Kumar NA

Web Stories

telugu drushyam3: మలయాళం బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో రూపొందిన తాజా సినిమా ‘దృశ్యం 3’ (Drushyam 3) . మోహన్‌ లాల్‌ హీరోగా జీతూజోసెఫ్‌ డైరెక్షన్‌లోని ఈ దృశ్యం 3 సినిమా ఏప్రిల్‌ 2న (Drushyam 3 Release date)  థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఇక హిందీలో అజయ్‌దేవగన్‌ హీరోగా చేస్తున్న ‘దృశ్యం 3’ సినిమా అక్టోబరు 2న రిలీజ్‌ కానుంది. అయితే తెలుగులో ‘దృశ్యం 3’ సినిమాపై ఇప్పటివరకు ఓ క్లారిటీ రాలేదు (Drushyam 3 Telugu canceled?).

ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ‘దృశ్యం 3’ సినిమా ఉందని, ఇందులో మీనాతో కలిసి మరోసారి యాక్ట్‌ చేయనున్నట్లుగా వెంకటేశ్‌ చెప్పారు. కానీ ఇప్పుడు ‘దృశ్యం 3’ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒక దశలో ఈ సినిమా ఒక ఉండదనే ప్రచారం కూడా జరుగుతోంది (Drushyam 3 Telugu movie update).

ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలోని ‘ఆదర్శకుటుంబం హౌస్‌ నెం. 47’ సినిమా చేస్తున్నారు వెంకటేశ్‌. ఆ చిత్రం తర్వాత అనిల్‌రావిపూడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సీక్వెల్‌ ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ సినిమా చేయనున్నారట వెంకటేశ్‌. జూన్‌ నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వచ్చే 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలన్నది చిత్రంయూనిట్‌ ప్లాన్‌ అని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇలా వెంకటేశ్‌ ‘దృశ్యం 3’ సినిమా చేసేందుకు సమయం కుదరడం లేదట. మరి..ఈ విషయంపై వెంకటేష్‌ అండ్‌ టీమ్‌ నుంచి సరైన క్లారిటీ వస్తుందెమో చూడాలి (Drushyam 3 cancellation rumours).

ఇక ‘దృశ్యం 3’ సినిమాను తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేస్తామని ఓ సందర్భంగా మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్, మలయాళ వెర్షన్‌ డిఫరెంట్‌ తేదీల్లో విడుదలకు సిద్ధం అవ్వడం విశేషం. అలాగే తెలుగు ‘దృశ్యం 3’పై సరైన అప్‌డేట్‌ లేకపోవడం గమనార్హం.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi