శంబాల దర్శకుడితో సందీప్‌కిషన్‌

Viswa
1 Min Read

Web Stories

Shambhala Makers with Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ కొత్త సినిమా ఖరారైంది. ‘శంబాల’తో సూపర్‌హిట్‌ అందుకున్న దర్శకుడు యుగంధర్‌ ముని డైరెక్షన్‌లో సందీప్‌కిషన్‌ ( Sundeep Kishan New Film)  హీరోగా ఓ సినిమా రానుంది. ‘శంబాల’ సినిమాను నిర్మించిన నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజులే, ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సోషియో ఫాంటసీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు.

”ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమాలో భాగమైన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం” అని యూనిట్‌ పేర్కొంది.

Please Share
Share This Article
6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi