మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన ‘జయ జయ జయ జయహే’ సినిమా తెలుగు రీమేక్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi Review)సినిమా రూపొందింది. రీమేక్ సినిమాలు తక్కువగా వస్తున్న ఈ తరుణంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతమేరకు మెప్పించే ప్రయత్నం చేసిందో ఓ సారి రివ్యూలో చదివేయండి.
సినిమా: ఓం శాంతి శాంతి శాంతిః (Om Shanti Shanti Shantihi Review)
ప్రధాన తారాగణం: తరుణ్‌భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, శివన్నారాయణ, గోపరాజు విజయ్, సురభి ప్రభావతి (Om Shanti Shanti Shantihi movie Cast and crew)
దర్శకత్వం: ఏఆర్ సజీవ్ (నూతన పరిచయం)
నిర్మాణం: ఆదిత్యా పిట్టీ, సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జులాది, బాల సౌమిత్రి
సంగీతం: జయ్ క్రిష్
కెమెరా: దీపక్
ఎడిటింగ్: ఏఆర్ సజీవ్ అండ్ టీమ్
నిడివి: 2 గంటల 11 నిమిషాలు
విడుదల తేదీ: 30–01–2027
రేటింగ్:2.5/5
Om Shanti Shanti Shantihi Story:కథ
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి కొండవీటి ప్రశాంతి. పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష. కానీ కుంటుంబ సభ్యుల ఒత్తిడితో ఓంకార్ నాయుడుని వివాహం చేసుకోవాల్సి వస్తుం ది. పెళ్లి చూపుల సమయంలో ప్రశాంతి చదువును తాను ప్రోత్సాహిస్తానని ఓంకార్ నాయుడు హమీ ఇస్తాడు. కానీ పెళ్లి తర్వాత ప్రశాంతి ఆశలు, అంచనాలు అన్నీ మారిపోతాయి. తన చదువు విషయంలో కూడ తన భర్త నుంచి సపోర్ట్ లభించదు. పైగా తనపై తరచూ చేయిచేసుకుంటుంటాడు. పెళ్లైన ఆరు నెల ల్లోనే 26 సార్లు ప్రశాంతిని కొడతాడు. దీంతో ఓ రోజు ఓంకార్ నాయుడుపై ప్రశాంతి ఎదురుదాడి చేస్తుంది. ఓంకార్ నాయుడుని ప్రశాంతి బాగా కొడుతుంది. దీంతో ప్రశాంతిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఓంకార్ నాయుడు.
ప్రశాంతిని గర్భవతిని చేస్తే, పిల్లలే తన ప్రపంచం అయిపోతుందని, పైగా తాను శారీ రకంగా బలహీనంగా అవుతుందని..ఇలా ప్రశాంతితో కోట్లాటలో తనదే పైచేయి అవుతుందని ప్లాన్ వేస్తాడు. మరి…ఓంకార్ నాయుడు ప్లాన్ ఎలా వర్కౌట్ అయ్యింది? తనను దెబ్బతీసేందుకు భర్త ప్లాన్ చేశాడని తెలుసుకున్న ప్రశాంతి ఏం చేసింది? ప్రశాంతి–ఓంకార్ నాయుడుల గొడవ పడిన వీడియో ఎలా వైరల్ అయ్యింది? అన్నది సినిమాలో చూడాల్సిన అంశం (Om Shanti Shanti Shantihi movie review).
విశ్లేషణ
సమాజంలో మహిళ సాధికారిత, స్త్రీ స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక స్వావలంభన…వంటి అం శాల ఆవశ్యకతను మరోసారి ప్రేక్షకులకు గుర్తుచేసే సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతి:’. మలయాళంలో వచ్చిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. క్లైమాక్స్‌ను కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు (Telugu remake Jaya Jaya Jaya Jaya Hey).
ప్రశాంతికి పెళ్లికి జగరడం, పెళ్లి తర్వాత ఓంకార్ నాయుడు– ప్రశాంతిల మధ్య గొడవలు, భర్తపై ప్రశాంతి తరగడబడటం…వంటి సన్నివేశాలతో తొలిభాగం ముగుస్తుంది. భార్యపై చేయి సాధించడానికి ఓంకార్ నాయుడు ప్లాన్ వేయడం, ఈ నిజం ప్రశాంతికి తెలియడం, ప్రశాంతి లైప్‌లో నిలదొక్కుకోవడం…వంటి సన్నివేశాలతో ఈ సినిమా ముగుస్తుంది (domestic violence comedy).
భార్యభర్తల మధ్య గొడవలను హైలైట్ చేశారు. కాస్తంత దాంపత్యజీవితంలోని పాజిటివ్ కోణాన్ని కూడ టచ్ చేస్తే బాగుండేది. అసలు..ప్రశాంతి–ఓం కార్ నాయుడుల గొడవకు గల మూలకారణం ఏంటో సరైన స్పష్టత ఉండదు. పెళ్లైన కొత్తలో ఓ భార్య తనకు దూరంగా ఉండమని, భర్తకు చెబితే, అప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటి? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడ కథనం ఉంటే బాగుండేది.
పైగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఇరు కుటుంబసభ్యుల జోక్యం చేసుకుని, ఒకరినొకరు కొట్టుకోవద్దని చెబతారే కానీ, అసలు..ఏందుకు కోట్లాట మొదలైందనే విషయంపై కుటుంబసభ్యులు ఎవరూ ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. కథలో కొంత ల్యాగ్ ఉంది. ప్రశాంతి క్యారెక్టర్‌ను హైలైట్ చేయడానికే, సెకండాఫ్‌లో ఓంకార్ నాయుడు క్యారెక్టర్‌ను ఓ సైడ్ క్యారెక్టర్ చేశారనిపిస్తోంది. కానీ కథలో మహిళలకు చదువును గురించిన ఇంపార్టెన్స్ గురించి చక్కగా చూపించారు. అక్కడక్కడ కామెడీ బాగుంది. అలాగే ప్రశాంతికి సంబంధం తీసుకోచ్చిన క్యారెక్టర్….కొన్ని కీలక సన్నివేశాల్లో లేకపోవడం కరెక్ట్‌గా లేదనిపిస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
కొండవీటి ప్రశాంతి పాత్రలో ఈషారెబ్బా (EeshaRebba Om Shanti Shanti Shantihi) మంచి నటన కనబరచారు. యాక్షన్ సీక్వెన్స్ బాగా చేశారు. ఎమో షనల్ సీన్స్‌లోనూ మెప్పించారు. అంబటి ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Om Shanti Shanti Shantihi) బాగానే చేశారు. గోదావరి స్లాంగ్ ఒకే. హీరో ఓంకార్ నాయుడు మావయ్యగా బ్రహ్మాజీ మంచి కీలకమైన రోల్ చేశారు. ప్రశాంతి తండ్రిగా శివన్నానారయణ, ప్రశాంతి మావయ్యగా గోపరాజు నటించారు. సెకండాఫ్‌లో జడ్జి పాత్రలో బ్రహ్మానందం కనిపించారు. బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వి వారి వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు.జయ్ క్రిష్ మ్యూజిక్ ఒకే. ఆర్ఆర్ అక్కడక్కడ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకో పదినిమిషాలు కట్ చేయవచ్చు. నిర్మాణ విలువలు ఒకే (ఓం శాంతి శాంతి శాంతిః సమీక్ష).
ఫైనల్‌గా..దాంపత్యజీవితంలో భార్యకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం ఉండేలా భర్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పే చిత్రం ఇది. అలాగే మహిళల సాధికారిక, ఆర్థిక స్వాతంత్య్రం ఎంత ముఖ్యమో గుర్తు చేసే సినిమా ఇది. కాస్త ఉమెన్ సెంట్రిక్‌గా అనిపించవచ్చు. ఓసారి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. అయితే ‘జయ జయ జయ జయహే’ సినిమాను ఆల్రెడీ చూసిన వీక్షకులకు ఈ సినిమా పట్ల భిన్నాభిప్రాయలు ఉండొచ్చు (ఓం శాంతి శాంతి శాంతిః సమీక్ష).

