please subscribe to Tollywoodhub YouTube channel

పెద్ది వాయిదా…కొత్త తేదీ ఎప్పుడు?

Viswa

Web Stories

Peddi Movie Postponed: రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా రిలీజ్‌ వాయిదా పడిందని తెలిసింది. తొలుత ‘పెద్ది’ (Peddi) సినిమాను రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ ఏడాది మార్చి 27న రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఈ ఏప్రిల్‌ 30కి (Peddi Movie New Release date) వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఏప్రిల్‌ 30న పెద్ది సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. టాకీ పార్టు చిత్రీకరణ ఆల్మోస్ట్‌ పూర్తయినప్పటికీని, ఇంకా సాంగ్స్‌ చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉంది. ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లోని హీరోయిన్‌ ఇంకా ఖరారు కాలేదు. సాంగ్స్‌ చిత్రీకరణను పూర్తి చేసి, క్వాలిటీగా పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కంప్లీట్‌ చేయడం అనేది పెద్ద బిగ్‌ చాలెంజ్‌. అందుకే ‘పెద్ది’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్లుగా తెలిసింది.

ఇటీవల ఈ సినిమా నుంచి ‘పెద్ది’ పహిల్వాన్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించింది. ‘పెద్ది’ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో హడావిడిగా సినిమాను కంప్లీట్‌ చేయడం అనేది మేకర్స్‌కు మింగుడు పడటం లేదు. పైగా…క్వాలిటీ ప్రొడక్ట్‌నే రెడీ చేసి, బిజినెస్‌ పరంగానూ, మరింత సేఫ్‌ జోన్‌లోకి వెళ్లాలన్నది మేకర్స్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. మరి..కొత్త రిలీజ్‌ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమా రిలీజ్‌ సమ్మర్‌ను దాటిపోతే, ఈ ఏడాది సమ్మర్‌ అంతా చాలా డల్‌గా అంటే…ఓ పెద్ద సినిమాలేకుండానే ముగుస్తుందన్నట్లుగా చెప్పవచ్చు.

జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దివ్వేందు శర్మ, జగపతిబాబు, శివరాజ్‌కుమార్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1980 నేపథ్యంతో సాగే రూరల్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌ ఇది. ఇందులో విభిన్నమైన ఆటలు ఆడే క్రీడాకారునిగా రామ్‌చరణ్‌ కనిపిస్తారు. అంటే …ఇం దులో క్రికెటర్‌, కబడ్డీ, కుస్తీ…ఇలాంటి ఆటలు ఆడే వ్యక్తిగా రామ్‌చరణ్‌ కనిపిస్తారు. అలాగే ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi