Madhavan GDN: మాధవన్‌…ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియా

Madhavan GDN: ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియాగా చెప్పుకునే జీడీనాయుడు బయోపిక్‌లో మాధవన్‌ యాక్ట్‌ చేస్తున్నారు.

Viswa
1 Min Read
Hero Madavan Acting in GD Naidu Biopic GDN2

Madhavan GDN: ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన జీడీ నాయుడు బయోపిక్‌ జీడీఎన్‌ (GDN)లో యాక్ట్‌ చేయనున్నారు మాధవన్‌ (Madhavan GDN). ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. జీడీ నాయుడు బయోపిక్‌కు జీడీఎన్‌ అనే టైటిల్‌ పెట్టారు. ఈ సినిమాలో జీడీ నాయుడు పాత్రలో మాధవన్‌ నటిస్తారు. ఇతర కీలకమైన పాత్రల్లో ప్రియ మణి, జయరాం, యోగిబాబు కనిపిస్తారు. కృష్ణకుమార్‌ రామకుమార్‌ జీడీ నాయుడు బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. గోవింద్‌ వసంత్‌ ఈ బయోపిక్‌కు సంగీతం వహిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీ కరణ ఇటీవల విదేశాల్లో ప్రారంభమైంది. ఇప్పుడు ఇండియాలో ప్రారంభమైంది. వర్గీస్‌ మూలన్, విజయ్‌ మూలన్, సరిత మాధవన్, ఆర్‌. మాధ వన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026లో ఈ మూవీ రిలీజ్‌ కావొచ్చు. ఇండియాలో తొలి మోటార్‌ వెహికల్‌ను ఆవిష్కరించిన గొప్ప వ్యక్తి, ఇంజినీర్‌గా జీడీ నాయుడు గుర్తింపు సంపాదించారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది.

R Madhavan GDN Poster
R Madhavan GDN Poster

ఇక బయోపిక్‌లో నటించడం అనేది మాధవన్‌కు కొత్త ఏమీ కాదు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్‌ బయోపిక్‌ ‘రాకెట్రీ: ది నంబిఎఫెక్ట్‌’ మూవీలో మాధవన్‌ యాక్ట్‌ చేశారు. నంబినారాయణన్‌గా మాధవన్‌ అంద్భుతంగా యాక్ట్‌ చేశాడు. ‘రాకెట్రీ: ది నంబిఎఫెక్ట్‌’కు జాతీయ అవార్డు కూడా వచ్చింది. అంతేకాదు.. ‘రాకెట్రీ: ది నంబిఎఫెక్ట్‌’ కోసం మాధవన్‌ తొలిసారిగా దర్శకత్వం వహించారు.

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *