MaheshbabuSSMB29: ఈ సీక్రెట్‌ స్ట్రాటజీ ఎందుకో..?

Viswa
1 Min Read
MaheshBabuSSMB29

ప్రియాంకా చోప్రా (Priyankachopra) రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా హైదరాబాద్‌లోనే టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. మహేశ్‌బాబు మూవీ MaheshbabuSSMB29  కోసం తరచూ హైదరాబాద్‌ వస్తున్నారు. గత నెలలో ప్రియాంకా చోప్రా దాదాపు పదిహేనురోజులు హైద రాబాద్‌లోనే ఉన్నారు. రాజమౌళి డైరెక్షన్‌లోని మూవీ కోసం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ బంధువల పెళ్లి కోసం ముంబై వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి ఫిబ్రవరి 16న హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రియాంకా చోప్రా ఇప్పుడు హైదరాబాద్‌ వచ్చింది సినిమా షూటింగ్‌ కోసమే అని స్పష్టం అవుతోంది.

అయితే ప్రియాంకా చోప్రా తన ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి తన లొకేషన్‌ డిటైల్స్‌ బహిర్గతపరిస్తే కానీ… మహేశ్‌ బాబు కొత్త సినిమా గురించి ఏమీ బయటకు రావడం లేదు. ఎట్‌లీస్ట్‌ షూటింగ్‌ అప్‌డేట్స్‌ కూడా అఫీషి యల్‌గా వెల్లడించడం లేదు మేకర్స్‌. ఎప్పుడూ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ తన సినిమాలను గురించి చెప్పే రాజ మౌళి ఈ సారి మాత్రం మీడియాకు ముఖం చాటేశారు. దీంతో అసలు…ఈ ప్రాజెక్ట్‌ విషయంల రాజమౌళి – మహేశ్‌బాబుల ఎందుకు ఇంత సీక్రెసీ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారన్న విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

షూటింగ్‌ పనులైతే చకా చకా జరిగిపోతున్నాయి. సెట్‌ వర్క్స్‌ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర భారీ సెట్స్‌ వేశారట.లొకేషన్స్‌ కోసం రాజమౌళి కెన్యా కూడా వెళ్లొచ్చారు. మరి…రాజమౌళి ప్రస్తుతం పాటిస్తున్న ఈ స్ట్రాటజీ ఏంటో త్వరలోనే తెలుస్తుందెమో చూడాలి.

విజయేంద్రప్రసాద్‌ కథ అందించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ విలన్‌గా నటిస్తారని, మెయిన్‌ విలన్‌గా మాత్రం ప్రియాంకా చోప్రా ఉంటారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.ఇక ఈ సినిమాకు చెందిన నటీనటులు–ఇతర సాంకేతిక నిపుణులను గురించి, ఇతర పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Please Share
4 Comments