please subscribe to Tollywoodhub YouTube channel

ఓటీటీలో మన శంకర వరప్రసాద్ నయా రికార్డ్..!

Kumar NA

Web Stories

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రం థియేటర్లలోనే కాకుండా, ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం, కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్‌ను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. వెండితెరపై అలరించిన మెగాస్టార్ మ్యాజిక్, ఇప్పుడు చిన్న తెరపై కూడా అదే స్థాయిలో వర్కవుట్ అవుతోందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

థియేటర్లలో రికార్డులు తిరగరాయడం మెగాస్టార్‌కి అలవాటే, ఇప్పుడు ఓటీటీలోనూ అదే ఊతకోత మొదలైంది’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, చిరంజీవి కెరీర్‌లోనే భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. థియేటర్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా ఏకంగా రూ. 375 కోట్లు రాబట్టి మెగాస్టార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా చేరింది.

మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో మెరిసి సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి, చిరు టైమింగ్ తోడవడంతో ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై లాంగ్ రన్ కొనసాగించేలా కనిపిస్తోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi