please subscribe to Tollywoodhub YouTube channel

‘ది ప్యారడైజ్‌’ మూవీ రిలీజ్‌ వాయిదా…కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..!

Viswa
Nani The Paradise Movie

Web Stories

The Paradise Release postponed: నాని ‘ది ప్యారడైజ్‌’ సినిమా రిలీజ్‌ వాయిదా పడింది (The Paradise Release postponed). ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబి నేషన్‌లోని లేటెస్ట్‌ మూవీ ఇది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో మోహన్‌బాబు, రాఘవ్‌ జూయల్, సంపూర్ణేష్‌బాబు ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ‘ది ప్యారడైజ్‌’ (TheParadise Movie) సినిమాను తొలుత మార్చి 26న రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు.

భారీ స్థాయిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ‘ది ప్యారడైజ్‌’ సినిమా రిలీజ్‌డేట్‌ను అనౌన్స్‌చేసినప్పట్నుంచే, ఈ సినిమా రిలీజ్‌ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తూనే ఉంది. ఫైనల్‌గా అదే నిజమైంది. ‘ది ప్యారడైజ్‌’ సినిమాను ఆగస్టు 21న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఆగస్టు 21 రిలీజ్‌ (TheParadiseMovie New Release date) సమయంలో వీకెండ్‌ హాలీడేస్, ఫెస్టివల్స్‌ ఉన్నాయి. ఒకవేళ ‘ది ప్యారడైజ్‌’ సినిమా ఆగస్టు 21నే రిలీజ్‌ అయితే, ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ వస్తాయని ఊహించవచ్చు.

‘ది ప్యారడైజ్‌’ సినిమా వర్క్‌ కాస్త స్లోగా సాగుతుంది. క్వాలిటీ విషయంలో టీమ్‌ కాంప్రమైజ్‌ కావడం లేదు. మరోవైపు సుజిత్‌ డైరెక్షన్‌లోని సినిమాను ఈ ఏడాదే సెట్స్‌కు తీసుకువెళ్లాలని, నాని భావిస్తున్నారు. వెంకీఅట్లూరితో కూడా నాని ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ తరుణంలో
‘ది ప్యారడైజ్‌’ సినిమా ఆగస్టు 21న రిలీజ్‌ అవుతుందా? అనేది చూడాలి. ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi