NTRNeel Movie Update: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (Director PrashanthNeel) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (Dragon). ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా ఈ షూటింగ్‌కు చిన్న బ్రేక్ పడింది (latest telugu cinema news).
ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన నైట్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్టీఆర్ తీవ్రమైన జలుబు, జ్వరానికి గురైనట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు తారక్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే మళ్ళీ కెమెరా ముందుకు రానున్నారు. అప్పటి వరకు ఈ షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యమవుతున్నా, అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన వెంటనే, చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాల కోసం విదేశాలకు వెళ్లనుంది (telugumovie news)
ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాదే రావాలి (latest telugu cinema news) , కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో అనారోగ్యం పాలయ్యారన్న వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తారక్ త్వరగా కోలుకుని ‘డ్రాగన్’ సెట్స్‌లో అడుగుపెట్టాలని అందరూ కోరుకుంటున్నారు (latest telugu cinema news).