please subscribe to Tollywoodhub YouTube channel

హారర్‌ ఫిల్మ్‌ పొలిమేరకు నో చెప్పిన ప్రియదర్శి

Viswa
1 Min Read
Priyadarshi missed polimera movie

Web Stories

తెలుగు హారర్‌ మూవీస్‌లో ‘పొలిమేర’కు ప్రత్యేకస్థానం ఉంది. అనిల్‌ విశ్వనాథ్‌ డైరెక్షన్‌లోని ఈ హారర్‌ కమ్‌ మర్డర్‌ మిస్టరీ మూవీ ‘పొలిమేర’ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడదులై, మంచి పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ మూవీలో ‘సత్యం’ రాజేష్, కామాక్షీ భాస్కర్ల, రామ్‌ ప్రసాద్‌లు లీడ్‌ రోల్స్‌ చేశారు. అయితే ఈ మూవీ తొలిచాన్స్‌ ప్రియదర్శికి వెళ్లింది.

నవీన్‌చంద్ర హీరోగా చేసిన ‘28 డిగ్రీస్‌ సెల్సియస్‌’ మూవీ లో ప్రియదర్శి ఓ లీడ్‌ రోల్‌ చేశాడు. దర్శకుడిగా ఈ మూవీ ‘పొలిమేర’ దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌కు తొలి సినిమా. కొన్ని కారణాల వల్ల 2020లో రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం, 2025 ఏప్రిల్‌4న రిలీజ్‌ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లోనే ‘పొలిమేర’ ప్రయా ణంను గురించి కూడా షేర్‌ చేసుకున్నాడు అనిల్‌.

పొలిమేరకు నో చెప్పిన హీరోలు

‘పొలిమేర’ సినిమా కథను తొలుత ప్రియదర్శి(Priyadarshi)కి చెప్పి, హీరోగా చేయమని అడిగితే, ఇలాంటి కథలు తనకు సెట్‌ కావని చెప్పాడట.ఆ తర్వాత ‘పలాస’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి, అడివి శేష్‌లను కూడా ‘పొలిమేర’ సినిమా కోసం ప్రయత్నించారట అనిల్‌. కానీ ఫైనల్‌గా ఈ మూవీ ‘సత్యం’ రాజేష్‌ చెంతకు చేరింది. ‘పొలిమేర’ ఫస్ట్‌పార్టు ఓటీటీలో విడుదలైన, రెండోపార్టు ‘పొలిమేర 2’ 2023లో థియేటర్స్‌లో విడుదలై, అద్భుత విజయం సాధిం చింది. దీంతో పొలిమేర 3 సినిమాను కూడా ప్లాన్‌ చేశారు.

సంక్రాంతికి పొలిమేర 3

పొలిమేర3 సినిమా చిత్రీకరణను ఆగస్టులో ప్రారంభిస్తామని, జనవరి కల్లా షూటింగ్‌ పూర్తి చేసిన సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేయాలన్నది తమ ప్లాన్‌ అని అనిల్‌ విశ్వనాథ్‌ చెప్పుకొచ్చారు. అంతే కాదు.‘పొలిమేర 3’లో ఓ ముఖ్యమైన క్యారెక్టర్‌కు ఓ స్టార్‌ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నామని, అన్నీ కుదిరితే అతి త్వరలోనే ఆయన పేరును ప్రకటిస్తామని కూడా అనిల్‌ చెప్పుకొచ్చాడు.

 

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi