శివరాత్రికి ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమా రిలీజ్‌ ఫిక్స్‌

Viswa

Web Stories

Spirit Release date: ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. 2026 సంక్రాంతి ఫెస్టివల్‌ సందర్భంగా ‘స్పిరిట్‌’ సినిమా రిలీజ్‌డేట్‌ (Prabhas Spirit release date)ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ‘స్పిరిట్‌’ సినిమాను 2027 మార్చి 5న (Prabhas Spirit movie Release date )రిలీజ్‌ చేయనున్నట్లుగా, ఈ చిత్రం దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా అధికారికంగా ప్రకటించారు (Prabhas Spirit movie news).

2027 మార్చి 7న (Spirit movie release date March 5 2027)మహాశివరాత్రి ఫెస్టివల్‌ ఉండటం, ఆ పై వీకెండ్, ఈ వెంటనే హోలి ఫెస్టివల్‌ డేట్స్, ఇంకా మళ్లీ వీకెండ్‌ ఇలా పర్‌ఫెక్ట్‌ రిలీజ్‌డేట్‌ను ప్లాన్‌ చేశాడు సందీప్‌రెడ్డి వంగా. అయితే ‘స్పిరిట్‌’ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్‌ కానుందని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో వెంటనే ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ఫై అధికారిక ప్రకటన రావడం విశేషం. ఇక ‘స్పిరిట్‌’ సినిమాలో ‘యానిమల్‌’ ఫేమ్‌ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్, వివేక్‌ ఓబెరాయ్, కాంచనలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీ సిరీస్‌ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్‌ పతాకంపై ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్‌కుమార్, భూషణ్‌కుమార్‌లు (Spirit movie cast and crew) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘యానిమల్‌’ సినిమాకు సంగీతం అందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఈ ‘స్పిరిట్‌’ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌ ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రభాస్‌ పాల్గొనగా, హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ప్రభాస్‌ ప్రస్తుతం వేకేషన్‌లో ఉన్నారు. తిరిగి రాగానే, వచ్చే నెల చివర్లో ‘స్పిరిట్‌’ సినిమా చిత్రీకరణలో ప్రభాస్‌ పాల్గొనే అవకాశం ఉంది. ప్రభాస్‌ హీరోగా ప్రజెంట్‌ ‘ఫౌజి’ అనే మరో సినిమా కూడా తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు మేకర్స్‌. దీంతో తొలుత ప్రభాస్‌ ప్రియారిటీ షూటింగ్, ఈ సినిమాయే..సో..ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘స్పిరిట్‌’ సినిమాతో ప్రభాస్‌ మరింత బిజీ అవుతాడని ఊహించవచ్చు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi