రాజమౌళి ప్లాన్‌ మామూలుగా లేదుగా…!

SPM
SPM

Web Stories

Varanasi Release: మహేశ్‌బాబు (MaheshBabu) హీరోగా రాజమౌళి (Director SSRajamouli)  దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ (Varanasi Release)  సినిమా విడుదల తేదీపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సినిమా టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ‘వారణాసి’ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ చెప్పారు. అయితే ఈ ‘వారణాసి’ సినిమాను ఏప్రిల్‌ 9, 2027న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

ఏప్రిల్‌ 9వ (Varanasi Movie Release date) తేదీ అంటే ఇటు తెలుగు నూతన సంవత్సరాది, మరోవైపు శ్రీరామనవమి పండగలు ఉన్నాయి. ఈ పండగల నేపథ్యంలో ‘వారణాసి’ సినిమాను రిలీజ్‌ చేస్తే బాగుంటుందని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. పైగా ఈ సినిమాలో మహేశ్‌బాబు కొన్ని సన్నివేశాల్లో రాముడి పాత్రలో నటిస్తున్నారు. దీంతో శ్రీరామనవమి పండగ అనేది, ఈ ‘వారణాసి’ సినిమా రిలీజ్‌కు సరైన సమయమని రాజమౌళి అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. పైగా కృష్ణుడు, రాముడు గెటప్స్‌లో మహేశ్‌బాబును స్క్రీన్‌పై చూసుకోవాలని ఆయన అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్యాన్స్‌ ఎమోషన్స్‌కు తగ్గట్లుగా, ఈ సిని మాను శ్రీరామనవమికే రిలీజ్‌ చేయాలని రాజమౌళి అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది.

ఫారెస్ట్‌ అడ్వెంచర్, మైథలాజికల్, టైమ్‌ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ‘వారణాసి’ సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్, ప్రకాష్‌రాజ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరకర్త. కేఎల్‌ నారాయణ, రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos