Rajinikanth Coolie: బాలీవుడ్‌లో ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రయిట్ ఫిల్మ్ ‘వార్ 2’. ఈ చిత్రంలో హృతిక్‌రోషన్ కూడా ఓ హీరో. ఈ మూవీకి ‘బ్రహ్మస్త్ర’ ఫేమ్ అయాన్‌ముఖర్జీ డైరెక్టర్. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రెడీ అవుతున్న ‘వార్ 2’ మూవీని తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆగస్టు 14కి వాయిదా వేశారు.
Ramcharan Gamechanger: బ్రేక్ ఈవెన్‌కి గేమ్‌చేంజర్ ఎంత కలెక్ట్ చేయాలి?
కానీ ఇప్పుడు ఇదే డేట్‌కి రజనీకాంత్ ‘కూలీ’ (Rajinikanth Coolie) మూవీ కూడా రిలీజ్ అవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కోలీవుడ్ సమాచారం. కూలీ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్, సత్యరాజ్…ఇలా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన స్టార్ క్యాస్టింగ్ ఉంది. పైగా ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్. ఈ యంగ్ హీరో మూవీస్ అన్నింటిని తెలుగు ఆడియన్స్ బాగానే చూస్తున్నారు.
NTR:ఎన్టీఆర్ స్పీడ్ పెంచాల్సిన సమయం వచ్చింది!
‘వార్ 2’ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ సినిమా అంటే తెలుగులో హైప్ ఉంటుంది. హృతిక్‌రోషన్ అంటే తెలుగు ఆడియన్స్ చూస్తారు. కానీ రజనీకాంత్ సినిమాను చూడకుండ ఉండరు. అయితే సక్సెస్‌ఫుల్ మూవీ ‘వార్’కు సీక్వెల్‌గా వస్తున్న ‘వార్ 2’పై మాత్రం అంచనాలు ఉంటాయి. పైగా ఈ 2024లో బాలీవుడ్ ఫ్రాంచైజీ మూవీస్ ‘స్త్రీ2, భూల్‌భలయ్యా3, సింగమ్‌ఎగైన్ 3’ చిత్రాలు హిటై్టయ్యాయి. దీంతో ‘వార్ 2’ పై కూడా అంచనాలు ఉన్నాయి. మరి…ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.