రవితేజ సంక్రాంతి కల నెరవేరేనా?

Viswa
Raviteja76 movie first look poster

Web Stories

అదెంటో…రవితేజ (Raviteja) సోలో హీరోగా రీసెంట్‌ టైమ్స్‌లో సంక్రాంతికి థియేటర్స్‌కు వద్దామంటే అస్సలు కుదరడం లేదు. 2024 సంక్రాంతికి రవితేజ సోలో హీరోగా నటించిన ‘ఈగల్‌’ సినిమా రిలీజ్‌ కావాల్సింది. కానీ ఆ సమయంలో సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల వల్ల కావొచ్చు, ఆ సినిమాల నిర్మాతల ఒత్తిడి వల్ల కావొచ్చు…ఈగల్‌ సినిమా సంక్రాంతికి విడుదల కాలేదు. ఫిబ్ర వరిలో విడుదలై, ఫర్వాలేదనిపించుకుంది. కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ రవితేజ ఈ సినిమాను నిర్మించారు.

ఆ తర్వాత 2025 సంక్రాంతికి ‘మాస్‌ జాతర’ (Massjathara)  సినిమాతో థియేటర్స్‌కు వద్దామని రవితేజ ప్లాన్‌ చేశాడు. కానీ ‘మాస్‌ జాతర’ సినిమా షూటింగ్‌ 2025 సంక్రాంతిని మిస్సయ్యింది. రవితేజకు గాయం కావడం, అలాగే ఈ చిత్రం హీరోయిన్‌ శ్రీలీల ఇతర ఇండస్ట్రీ సినిమాలతో బిజీగా ఉండటం వంటి కారణాల చేత మాస్‌ జాతర మూవీ 2025 సంక్రాంతికి విడుదల కాలేదు. ఆ మాటొకస్తే…ఇంకా థియేటర్స్‌కూ రాలేదు. మాస్‌జాతర సినిమా ఆగస్టు 27న వినాయకచవితి ఫెస్టివల్‌ సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. సామజవరగమన సినిమాకు ఓ రైటర్‌గా పని చేసిన భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ బ్యానర్స్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా 2026 సంక్రాంతిని టార్గెట్‌ చేశాడు రవితేజ (Raviteja76 movie). సెన్సిబుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూ వీస్‌ తీసే దర్శకుడు కిషోర్‌ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ హీరోగా ఓ మూవీ రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీని సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తారు. అయితే ఈ సినిమాను 2026 సంక్రాంతికి  (Sankranthi2026 Release)రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ మూవీలో ఆషికా రంగనాథ్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ మూవీకి భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ డైరెక్టర్‌.

కానీ 2026 సంక్రాంతికి భారీ చిత్రాలే ఉన్నాయి. చిరంజీవి–అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లోని మూవీ, నవీన్‌పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, తమిళ హీరో విజయ్‌ చివరి చిత్రం ‘జన నాయ కగన్‌’ వంటి సినిమాలు సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ తరుణంలో రవితేజ చిత్రం సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే..అనిల్‌రావిపూడి, చిరంజీవి ఫన్‌ మార్క్‌తో వీరి మూవీ హాట్‌కేక్‌లా సంక్రాంతికి అమ్ముడుపోతుంది. నవీన్‌పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ సినిమాకు సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ వంటి స్ట్రాంగ్‌ బ్యానర్‌ ఉంది. విజయ్‌ చివరి సినిమా కాబట్టి, ఈ సినిమాకు బజ్‌ బాగానే ఉంటుంది. మరి..ఈ సినిమా లను దాటకుని, రవితేజ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi