అందరిపల్స్‌ పట్టేశాడు!

Suriya Retro Movie Telugu Trailer: సూర్య లేటెస్ట్‌ మూవీ 'రెట్రో' సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీకి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు.

Viswa
1 Min Read
Suriya Retro Movie Telugu Trailer Released

సూర్య లేటెస్ట్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ మూవీ ‘రెట్రో (Suriya Retro Movie Telugu Trailer). ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్‌. మే 1న ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ ట్రైలర్స్‌ను రిలీజ్‌ చేశారు. తెలుగులో సూర్యదేవర నాగవంశీ ఈ రెట్రో మూవీని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాడు. లవ్, లాఫ్‌ అండ్‌ వార్‌ వంటివి ప్రధానాంశాలుగా ‘రెట్రో’ మూవీ రూపుదిద్దుకుంది.

‘షో చేద్దామా..హా చేద్దాం..చేద్దాం..’,
‘గొడవలు, పంచాయితీలు, రక్తపాతాలు, రౌడీయిజాలు..అన్నీ ఈ క్షణమే వదిలేస్తా..’
‘నన్ను బాగా ఏడించావ్‌..పారీ’,
‘అందమైన, అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారు’
‘వాడు అందరి పల్ప్‌ పట్టేశాడు..ఇంకా ఏం ఏం ఆటలు ఆడతాడో’
‘ముద్దుల కొడుక..డాడీ ఈజ్‌ కమింగ్‌ ..రా’ అన్న డైలాగ్స్‌ ‘రెట్రో’ మూవీ తెలుగు ట్రైలర్‌లో ఉన్నాయి.

తమిళ విలక్షణ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సూర్య, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా, జోజూ జార్జ్, జయరామ్, కరుణాకరన్‌..ఇతర లీడ్‌ రోల్స్‌లో యాక్ట్‌ చేశారు. ట్రైలర్, క్రేజీగా…కార్తీక్‌ సుబ్బరాజ్‌ సిగ్నేచర్‌ స్టైల్లో కొత్తగా ఉంది. సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌ బాగుంది.

సూర్య గత చిత్రం ‘కంగువ’ మూవీ థియేటర్స్‌లో ఆడలేదు. దీంతో ఈ రెట్రో మూవీపై సూర్య ఆశలు పెట్టుకున్నాడు.‘రెట్రో’ ట్రయిలర్‌ అయితే బాగుంది. మరి..సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఇదే రోజున…తెలుగులో నాని చేసిన ‘హిట్‌ 3’ మూవీ థియేటర్స్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. శైలేష్‌ కొలను ‘హిట్‌ 3’ దర్శకుడు. నాని నిర్మాత.

 

Tamannaah Odela2 Movie Review: తమన్నా ఓదెల2 మూవీ రివ్యూ

అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి రివ్యూ

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *