Sankranthiki Vasthunam Remake: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం కురిపించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ కి సిద్ధమైంది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో పండించిన మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రను హిందీలో అక్షయ్ కుమార్ (Sankranthiki Vasthunam Remake) పోషించనున్నారు. గతంలో సౌత్ రీమేక్స్‌తో భారీ హిట్లు అందుకున్న అక్షయ్ (hero AkshayKumar), మరోసారి ఈ వినోదాత్మక కథతో తన లక్ ను పరీక్షించుకోబోతున్నారు (latest telugu movies).
ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలో చిన్నపాటి మార్పులు చేసి, మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. అక్షయ్ కుమార్ సరసన వెర్సటైల్ నటి విద్యా బాలన్ నటించబోతుండటం. తెలుగులో ఐశ్వర్య రాజేష్ పోషించిన ‘అతి జాగ్రత్త’ కలిగిన భార్య పాత్రలో విద్యా బాలన్ కనిపించనున్నట్లు సమాచారం. ‘భూల్ భూలయ్య’, ‘మిషన్ మంగళ్’ వంటి సినిమాల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తుండటంతో హిందీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో అత్యంత కీలకమైన ‘ఎక్స్ గర్ల్ ఫ్రెండ్’ పాత్రకు టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. తెలుగులో మీనాక్షి చౌదరి పోషించిన ఈ గ్లామరస్ రోల్‌ను హిందీలో రాశీ పోషించనున్నారు (ott telugu movies) .
హిందీలో ఇప్పటికే గుర్తింపు ఉన్న రాశీ, అక్షయ్ సరసన నటించడం ఆమె కెరీర్‌కు ప్లస్ కానుంది. తొలుత మీనాక్షి పేరు వినిపించినా, హిందీ మార్కెట్ దృష్ట్యా మేకర్స్ రాశీ వైపు మొగ్గు చూపారని టాక్. ‘ఎక్స్ గర్ల్ ఫ్రెండ్’ ‘వైఫ్’ మధ్య నలిగిపోయే ఓ మాజీ పోలీసు అధికారి కథను అనీస్ బాజ్మీ వంటి దర్శకులు తన మార్క్ కామెడీతో బాలీవుడ్ తెరపై ఎలా చూపిస్తారో చూడాలి. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మరికొద్ది రోజుల్లో రానుంది (upcomeing telugu movies).