Samantha’s Horror-Comedy Film Shubham Review: శుభం రివ్యూ

Viswa
4 Min Read
"Official Shubham Telugu movie poster with horror-comedy theme

సినిమా శుభం (Shubham Review)

ప్రధాన తారాగణం: హర్షిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గవిరెడ్డి, పెరి చరణ్, కొంతం శ్రియ, లక్ష్మీ శర్వాణి, షాలిని కొండెపూడి, వంశీధర్‌ గౌడ్‌
నిర్మాత: సమంత
దర్శకుడు: ప్రవీణ్‌ కండ్రేగుల
కెమెరా:మృదుల్‌ సేన్‌ గుప్తా
ఎడిటింగ్‌: ధర్మంధ్ర కాకర్ల
సంగీతం: క్లింటన్‌ సిరిజో, వివేక్‌ సాగర్‌
కథ: వసంత్‌ మారిగంటి
నిడివి: 2 గంటల 5 నిమిషాలు
రేటింగ్‌: 2.5/5
విడుదల తేదీ: మే 9, 2025 (Shubham movie release date)

Shubham Movie Story and Cast: స్టోరీ

కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌లను డిష్‌టీవీలు రీ ప్లేస్‌ చేస్తున్న రోజులవి. అంటే…ఏర్లీ 2000. విశా ఖపట్నం భీమునిపట్నంకి చెందిన శ్రీనివాస్‌ కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ కమ్‌ ఓనర్‌. తన ఫ్రెండ్స్‌ (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్‌ పెరి)లతో కలిసి హ్యాపీగా లైఫ్‌ లీడ్‌ చేస్తుంటాడు. ఇదే సమయంలో శ్రీనివాస్‌ కేబుల్‌ టీవీ వ్యాపారానికి, డిష్‌ కుమార్‌ అడ్డంకిగా మారతాడు. డిష్‌ కనెక్షన్స్‌ ఇవ్వడంలో డిష్‌ కుమార్‌ దూకుడుగా ఉండటంతో శ్రీనివాస్‌ ఇబ్బందులు పడు తుంటాడు (Shubham movie)

మరోవైపు బ్యాంకు ఉద్యోగి శ్రీవల్లితో (శ్రియ కొంతం)తో శ్రీనివాస్‌ వివాహం జరుగుతుంది. కానీ ఫస్ట్‌నైట్‌ రోజు శ్రీనివాస్‌కు వింత అనుభవం ఎదుర వుతుంది. టీవీలో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అయ్యే జన్మజన్మల అనుభంధం సీరియల్‌ చూస్తున్నంత సేపు శ్రీవల్లి…ఏదో దెయ్యం పట్టి నట్లుగా వింత వింతగా ప్రవర్తిస్తుంది. సీరియల్‌ అయిపోయిన తర్వాత ఏం జరగనట్లు..సాదాసీదాగా మళ్లీ మాములుగానే ఉంటుంది. ఇలా శ్రీవల్లి వింత ప్రవర్తన శ్రీనివాస్‌ను షాక్‌కు గురి చేస్తుంది. జన్మ జన్మల సీరియల్‌ వల్ల తన భార్యతో తాను పడుతున్న ఇబ్బందులనే తన స్నేహితులు కూడా పడుతున్నారని శ్రీనివాస్‌ తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తెలిసేది ఏంటంటే…ఇదే ప్రాబ్లమ్‌తో ఆ ఊర్లోని చాలామంది అవస్తలు పడుతుంటారు. అసలు..రాత్రి తొమ్మిది గంటలకు టీవీలో ప్రసారం అయ్యే జన్మ జన్మల బంధం సీరియల్‌ చూసి, ఆ ఊర్లోని మహిళలు ఎందుకు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు? మరి…ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? శ్రీనివాస్‌ అండ్‌ ఫ్రెండ్స్‌కి మంత్రగత్తె మాయ మాతా శ్రీకి ఉన్న సంబంధం ఏమిటి? జన్మజన్మల అనుబంధం సీరియల్‌కి, ఆత్మలకు ఉన్న సంబంధం ఏమిటి?అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

వివరణ

ఓ టీవీ సీరియల్‌ చుట్టూ తిరగే కథ ఇది. హారర్‌ కామెడీ ఫిల్మ్‌ ఇది. సినిమా చాలా నెమ్మదిగా మొదలవుతుంది. ప్రారంభంలో ఊహాత్మాక సన్నివేశాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండవు. శ్రీనివాస్‌ ఫస్ట్‌నైట్‌ సీన్స్‌తో కథ ఊపందుకుందనుకుంటే…ఆ వెంటనే…శ్రీనివాస్‌ ఇంట్లో జరుగుతున్న తతంగమే…అతని ఫ్రెండ్స్‌ ఇంట్లోనూ జరుగుతున్నాయని చూపించే సీన్స్‌ రీపీట్‌ సీన్స్‌లా అనిపిస్తాయి. కానీ ఓ ఆసక్తికరమైన సీక్వెన్స్‌ ఇంట్రవెల్‌ వస్తుంది.

Samantha’s Shubham – A Perfect Blend of Horror and Comedy
Samantha’s Shubham – A Perfect Blend of Horror and Comedy

పోనీ..సెకండాఫ్‌లో ఏమైనా ఆడియన్స్‌ను ఎగై్జట్‌ చేసే ఎలిమెంట్స్‌ ఏమైనా ఉన్నాయా? అంటే…అవి తక్కువే ఉన్నాయి. అల్ఫామేన్‌ థియరీ, ముసలమ్మల ఆత్మలు…వంటి మరో సబ్‌ప్లాట్‌కి వెళ్లిపోతుంది స్టోరీ. కాన్సెప్ట్‌ బాగానే ఉంది..కానీ స్క్రీన్‌ ప్లే ఇంకాస్త ఆకర్షణీయంగా ఉండాల్సింది. వసంత్‌ కథలో ఇంకొంచెం నాటకీయతను రాసుకోవాల్సింది. స్టోరీలైన్‌ చిన్నది కావడంతో, కొన్ని ఫోర్డ్స్‌ సన్నివేశాలు, సాగదీత సన్నివేశాలను దర్శకుడు ఆశ్రయించాల్సి వచ్చింది. సమంత గెస్ట్‌ అప్పీ రియన్స్‌ ఈ సినిమాకు కాస్త బలంగా నిలిచింది. చివర్లో ‘సినిమాబండి’ టీమ్‌ ఎంట్రీతో ఆడియన్స్‌కు కాస్త రిలీఫ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాలో ఉన్న కొన్ని హారర్‌ సీన్స్, కామెడీ సీన్స్‌ వర్కౌట్‌ అయ్యాయనిపిస్తోంది. ఇలాంటి సీన్స్‌ ఇంకొన్ని ఉండే బాగుండేది. మొత్తంగా ఓ సారైతే చూడొచ్చు.

Shubham Telugu movie cast: నటీనటుల పనితీరు

ఈ సినిమాలోని (Samantha Shubham) నటీనటులంతా కొత్తవారు. ఉన్నవారిలో హర్షిత్‌రెడ్డియే అనుభవం ఉన్న వ్యక్తి. కామెడీ టైమింగ్‌ బాగానే ఉంది. శ్రీనివాస్‌ గవిరెడ్డి, పెరి చరణ్, కొంతం శ్రియ, లక్ష్మీ శర్వాణి, షాలిని కొండెపూడి…వారి పాత్రల మేరకు వచేశారు. వంశీధర్‌ పాత్ర ఇంకాస్త బలంగా ఉండాల్సింది (Shubham Telugu movie). పతాక సన్నివేశాలు ఇంకాస్త ఆసక్తికరంగా సాగి ఉండే బాగుండేది. కొత్త నటీనటులైనా, నిర్మాతగా సమంత బాగానే ఖర్చు పెట్టారు. అదీ స్క్రీన్‌పై తెలుస్తుంది. క్లింటన్‌ మ్యూజిక్‌ బాగుంది. వివేక్‌ ఆర్‌ఆర్‌ సినిమాకు ఓ ఫ్లస్‌ పాయింట్‌. మృదుల్‌ సేన్‌ గుప్తా విజువల్స్‌… ఒకే (Shubham movie review).

బాటమ్‌ లైన్‌ : సగమే శుభం

Srivishnu #Single Movie First Review: సింగిల్‌ ఫస్ట్‌ రివ్యూ

Nani HIT3 Cinema Review: హీరో నాని హిట్‌3 సినిమా రివ్యూ

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *