బ్లడీ రోమియో…నంబరు 1 గ్యాంగ్‌స్టర్‌

Viswa

Web Stories

BloodyRomeo: నాని హీరోగా సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాకు బ్లడీ రొమియో (BloodyRomeo) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా స్టార్టింగ్‌ నుంచి, ఈ టైటిలే వినిపించింది. ఫైనల్‌గా ఇదే టైటిల్‌ను మేకర్స్‌ ఫిబ్రవరి 24న అధికారికంగా ప్రకటించారు. అంటే…నాని బర్త్‌ డే సందర్భంగా ‘బ్లడీ రొమియో’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. నానితో శ్యామ్‌సింగరాయ్‌ వంటి సినిమా తీసిన వెంకట్‌ బోయన్‌పల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇందులో నాని గ్యాంగ్‌స్టర్‌ రోల్‌ చేస్తారు. మేజర్‌ షూటింగ్‌ లండన్‌లో జరుగుతుందని తెలిసింది. ఫుడ్‌ మాఫియా నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందట.ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌, త్రిప్తి దిమ్రీ వంటి వారిని ఫైనలేజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే ఈ యాక్షన్‌ సినిమాకూ హిందీ మార్కెట్‌ పరంగా ఎంతో కొంతలాభం చేకూరే అవకాశం ఉందనే ఆలోచన చేస్తున్నారు మేకర్స్‌.

మరోవైపు ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్‌’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తొలుత మార్చి 26న రిలీజ్‌కు ప్లాన్‌ చేశారని, షూటింగ్‌ ఆలస్యం కావడంతో, ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు.

నాని గత చిత్రం ‘హిట్‌’. తాజా మూవీ ‘ది ప్యారడైజ్‌’, నెక్ట్స్‌ మూవీ ‘బ్లడీ రొమియో’…ఈ సినిమాల లైనప్స్‌ చూస్తుంటే నాని, యాక్షన్‌ హీరోగా ఎస్టాబ్లిష్‌ కావడానికి బలంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram