‘డ్రాగన్’ లో అక్కినేని హీరో.. అసలు నిజం అదే..!

Kumar NA

Web Stories

Akkineni akhil in dragon movie: టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.ఈ యాక్షన్ డ్రామాలో అక్కినేని యువ హీరో అఖిల్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారని, ఆయన ఎంట్రీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ప్రచారం జరిగింది.

పాత్ర నిడివి తక్కువైనా, కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ ‘ట్విస్ట్’ లా అఖిల్ కనిపిస్తారని రావడంతో నందమూరి అభిమానులు సైతం పండగ చేసుకున్నారు. ఇద్దరు యంగ్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూడవచ్చని అంతా భావించారు.అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.దర్శకుడు ప్రశాంత్ నీల్, అఖిల్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వారు తరచుగా కలుస్తూ ఉండటంతో, వీరిద్దరి కాంబోలో ఏదో ఒకటి ఉండబోతుందని నెటిజన్లు ఊహించుకున్నారు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దృష్టి అంతా కేవలం ఎన్టీఆర్ పాత్రను మలచడంపైనే ఉంది. ఈ కథలో వేరే ఇతర హీరోలకు చోటు లేదని సమాచారం. క్లుప్తంగా చెప్పాలంటే, అఖిల్ ఈ సినిమాలో నటిస్తున్నారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే.

‘డ్రాగన్’ ఒక పక్కా సోలో హీరో సబ్జెక్ట్ అని, తారక్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది. సో, ప్రస్తుతానికి ఈ క్రేజీ మల్టీస్టారర్ అంచనాలకు తెరపడినట్లే అని చెప్పొచ్చు. కాగా చిత్ర బృందం ఇటీవల జోర్డాన్ దేశంలో ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అక్కడ దాదాపు మూడు అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లను చిత్రీకరించారు.: నిజానికి ఈ షెడ్యూల్ మార్చి వరకు జరగాల్సి ఉంది. కానీ అనుకున్న దానికంటే ముందే (ఫిబ్రవరి 22-25 మధ్య) షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. తదుపరి షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో లేదా ఆఫ్రికా వంటి ఇతర దేశాల్లో ఉండే అవకాశం ఉంది.ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ కనిపించిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.తారక్ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ అండ్ రగ్గడ్ అవతారంలో పొడవాటి గడ్డం, స్లిమ్ ఫిట్ బాడీతో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు.వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi