please subscribe to Tollywoodhub YouTube channel

సల్మాన్‌ఖాన్‌ హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ

Viswa

Web Stories

Salmankhan: సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెలుగులో తొలి సినిమా ఖరారైంది. తెలుగులో ‘ఎవడు, బృందావనం, మహర్షి, వారసుడు’ వంటి సినిమాలను తీసిన, దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్‌లోని వన్నాఫ్‌ ది టాప్‌ ప్రొడక్షన్స్‌లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఈ విషయాలను మేకర్స్‌ మార్చి 30న అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో నయనతారను హీరోయిన్‌గా అనుకుంటున్నారని, ఈ విషయంపై కూడా అతి త్వర లోనే అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.

Salmankhan: సల్మాన్‌ఖాన్‌ హీరోగా తొలి సినిమా

చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేశారు. యాక్టర్‌గా సల్మాన్‌కు ఇది తొలి సినిమా. హీరోగా మాత్రం వంశీపైడిపల్లి దర్శ కత్వంలోని సినిమా తొలి సినిమా. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ ‘మాతృభూమి’ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

బాలీవుడ్‌పై ‘దిల్‌’ రాజు ఫోకస్‌

బాలీవుడ్‌లో దిల్‌ రాజు ఫోకస్‌ పెట్టినట్లుగా తెలుస్తుంది. తెలుగు హిట్‌ ఫిల్మ్‌ ‘సంక్రాం తికి వస్తున్నాం’ హిందీ రీమేక్‌ను ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో అక్షయ్‌కుమార్‌ హీరో. విద్యాబాలన్, రాశీఖన్నా ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారని తెలిసింది. బాలీ వుడ్‌లో రీమేక్‌ స్పెషలిస్ట్‌ అనీస్‌ బాజ్మీ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఇలా ఉండ గానే..‘దిల్‌’ రాజు…మరో హిందీ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌తో మూవీని కన్ఫార్మ్‌ చేసుకున్నారు. ఇక గతంలో ‘దిల్‌’ రాజు బాలీవుడ్‌లో కొన్ని సినిమాలను నిర్మించగా, అవి బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కాలేకపోయాయి.

ఆమిర్‌ఖాన్‌ కథ కాదు కదా..!

‘వారిసు’ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి నెక్ట్స్‌ సినిమాలో హీరో అంటూ తొలుత ఆమిర్‌ఖాన్‌ పేరు వినిపించింది. ఫైనల్‌గా సల్మాన్‌ఖాన్‌ ఖరారై య్యారు. ఆమిర్‌ఖాన్‌కు వంశీపైడిపల్లి చెప్పిన కథతోనే, సల్మాన్‌ఖాన్‌తో సినిమా చేస్తున్నారా? లేక ఇదేమైనా కొత్త కథ అనే విషయంపై క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది.

పెద్ది వాయిదా…కొత్త తేదీ ఎప్పుడు?

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi