Music director Ramanujan: మన జీవితాల్లో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే అందమైన కథే ఈ ‘కార్మేనీ సెల్వం’ సినిమా అని చెప్పారు సంగీత దర్శకుడు రామానుజన్. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌గార్లతో పాటుగా, నిర్మాతన అరుణ్ రంగరాజులు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు ఆయన. సముద్రఖని, గౌతమ్‌వాసుదేవ్ మీనన్‌లు ప్రధాన పాత్రధారులుగా, లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తీక్ కుమార్, బడవ గోపీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కార్మెనీ సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళం) సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం సంగీత దర్శకుడు రామానుజన్ (Carmeni Selvam movie music director Ramanujan) కొన్ని ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా….
– 2017 బెంగళూరులో ‘మ్యూజిక్ క్లౌడ్ అండ్ టెక్నాలజీ’ అని ఓ సంస్థను ప్రారంభించాను. మొదట్లో కొన్ని కార్పొరేట్ కంపెనీలు, మీడియా సంస్థలతో భాగస్వామ్యమైనా, ఆ తర్వాత నా పనితీరును మరింత మెరుగు పరచుకుని, సినిమాలకు కూడా సంగీతం అందించడం స్టార్ట్ చేశాను. చెప్పాలంటే…దర్శకుడు చక్రితో పరిచయం నాకు లైఫ్ టర్నింగ్ పాయింట్.రామ్‌తో కలిసి గతంలో నేను ‘కురైయొండ్రుమ్ ఇల్లై’ సినిమాకు పని చేశాను. మళ్లీ ఇప్పుడు ‘కార్మేనీ సెల్వం’ చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం నాలుగు పాటలు. ఓఎస్‌డీ ట్రాక్, ఆర్‌ఆర్ ఇచ్చాను. మా మ్యూజిక్ క్లౌడ్ టీమ్‌లో 5గురం కలిపి పనిచేస్తున్నాం. అందుకే ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం అనేది టీమ్ వర్క్‌గా నేను చెబుతాను.

– సినిమాల నిర్మాణవ్యయం రోజురోజుకీ పెరిగిపోతుంది. నిర్మాణవ్యయాన్ని తగ్గించే మార్గంలో సంగీతం ఖర్చును కూడ తగ్గించడం ముఖ్యం. అందుకే చిత్ర దర్శక–నిర్మాతలకు మ్యూజిక్ క్లైడ్ ఒక కొత్త రెవెన్యూ విధానాన్ని తీసుకువచ్చింది. మా స్టూడియోతో అసోసియేట్ అయిన సౌండ్ ఇంజనీర్లు, వాయిద్యాకారులు, ప్రొగ్రామర్లతో సహా, మ్యూజిక్ పరంగా ఈ సినిమాలో భాగమై న అందరికీ, రాయల్టీ చెల్లింపులు ఉంటాయి.సినీ సంగీతంలో ఇదొక కొత్త ఒరవడి అని చెప్పవచ్చు.
– ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ సినిమాలకు సంగీతం అందించడం అంటే ఇష్టం. నా పేరు కంటే నా సంగీతమే ప్రేక్షకుల్లో ఎక్కువగా వినపడాలని కోరుకుంటాను.