Gedelaraju Kakinada Taluka Official Trailer: సంగీత దర్శకుడు – సింగర్, నటుడు రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘గేదెల రాజు’ (Gedelaraju Kakinada Taluka Movie). ఈ సినిమాలో రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రఘు కుంచె సమర్పణలో, చైతన్య మోటూరి దర్శకత్వంలో రవికుమార్ మోటూరి నిర్మించారు. ఈసినిమా ఈ నెల 17న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సినిమా ట్రైలర్‌లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి.
‘నిన్నుకోట్టాననుకో…వీడికి కోపం వస్తుంది…అదే ఈడ్నే కోట్టాననుకో…వీడికి నీకు భయం వేస్తుంది…
నాకు కావాల్సింది కోపం కాదురా…భయం…’
‘ఈ ఊర్లో పెద్ద పెద్దోళ్లే నాతో మాట్లాడేందుకు దడుస్తారు…ఫిగర్ కోసం పంచాయితీపెట్టడానికొచ్చావా..’
‘నువ్వసలు మనిషివేనా..’, ‘నా పేరు మీరా..’
‘చూస్తే ఒకటే నిజం..చూడకపోతే వంద అనుమానాలు..’
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రఘుకుంచె మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో కంటెంట్ ఉందని మేము నమ్ముతున్నాము. సినిమా రిలీజ్ అయ్యాక, ఈ సినిమాలో కంటెంట్ ఉందని, ప్రేక్షకులు నమ్మితే, ఈ సినిమాను ఆదరిస్తారు’’ అన్నారు.
నిర్మాత వాణి రవికుమార్ మోటూరి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు చైతన్య మా అబ్బాయి. అతనికి సినిమాలపై ప్యాషన్‌ను ఎంకరేజ్ చేయాలని ఈ సినిమాను నిర్మించాం. ట్రైలర్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. సినిమానూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము’’ అని చెప్పారు.
డైరెక్టర్ చైతన్య మోటూరి మాట్లాడుతూ – ‘‘గేదెలరాజు కాకినాడ తాలూకా…ఈ సినిమాకు మేం పెట్టిన క్యాప్షన్ చూస్తే…ఒకటే నిజం.. చూడకపోతే.. వంద అనుమానాలు’. ఈ క్యాప్షన్‌లో కథాసారం ఉంది. ఒక మర్డర్ మిస్టరీని..క్రైమ్ థ్రిల్లర్‌ని..రెండు గంటల ఒక్క నిమిషంతో…క్రిస్స్‌గా తెరకెక్కించాము. చివరి 40 నిమిషాలు..ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాకినాడలో రియల్ లోకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేశాం’’ అని చెప్పారు.

What’s up, everythiing is gooing perfectly here andd ofcourse ecery onee iss shasring facts, that’s actually excellent,
kwep upp writing. xnxx