తెలుగు తెరపై వెలగని తార

Viswa
2 Min Read

Web Stories

Kayadu Lohar: ప్రజెంట్‌ వన్నాఫ్‌ ది ట్రెడింగ్‌ హీరోయిన్స్‌లో కయాదులోహర్‌ ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరోయిన్‌ చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. నాని ‘ది ప్యారడైజ్‌’, ‘మలయాళ హీరో టోవినో థామస్‌ ‘పళ్లి చట్టంబి’, దుల్కర్‌సల్మాన్‌ ‘ఐయామ్‌ గేమ్‌’, నివిన్‌ ఫౌళి ‘తారమ్‌’, శింబు 48వ సినిమా, జీవీ ప్రకాష్‌ ‘ఇమ్మోర్టల్‌’, అథర్వ ‘ఇదయమ్‌ మురళి’ సినిమాల్లో కయాదు లోహర్‌నే హీరోయిన్‌ (Kayadu Lohar upcomeing movies). ఇంత బిజీగా ఉన్న కయాదు బర్త్‌ డే ఎప్పుడంటే…ఏప్రిల్‌ 11. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న కొన్ని సినిమాల నుంచి బర్త్‌ డే విషెస్‌ రూపంలో కొన్ని అప్‌డేట్స్‌ వచ్చాయి.

అలా నాని ‘ది ప్యారడైజ్‌’ సినిమా నుంచి అప్‌డేట్‌ కూడ వచ్చింది. ఈ సినిమాలో సుబ్బలక్ష్మిగా కయాదు లోహర్‌ నటిస్తున్నారని తెలిపి, కయాదు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా చిత్రంలో కయాదు పాత్ర కొత్తగా ఉండబోతుంది. వెండితెరపై వెలగని తార..అంటూ, ఈ సినిమాలోని ఆమె పాత్రను గురించి, వివరించే ప్రయత్నం చేశారు మేకర్స్‌. హీరోయిన్‌ కావాలనుకునే సుబ్బలక్ష్మీగా ఆమె నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో జడల్‌ పాత్రలో నాని, బిర్యానీగా సంపూర్ణేష్‌బాబు కనిపిస్తారు. మెయిన్‌ విలన్‌గా మోహన్‌బాబు, మోహన్‌బాబు పాత్ర తనయుడిగా బాలీవుడ్‌ నటుడు రాఘవ్‌ జూయల్‌ నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ఇంకా జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. కానీ ఈ తేదీకి ఈ సినిమా రాకపోవచ్చని, డిసెంబరులో రావొచ్చన్న పుకార్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ‘ది ప్యారడైజ్‌’ సిని మా ఆగస్టు నుంచి పోస్ట్‌పోన్‌ అయితే, రిలీజ్‌ మాత్రం ఇక వచ్చే ఏడాదే. ఎందుకంటే….డిసెంబరు నెలలో హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల తాకిడి ఎక్కువగా ఉంది. ‘ది ప్యారడైజ్‌’ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు కనుక…డిసెంబరులో రిలీజ్‌ కుదరకపోవచ్చు.

ఇక కయాదుకు చేతి నిండి సినిమాలైతే ఉన్నాయి కానీ…తెలుగులో హిట్‌ మాత్రం రావడం లేదు. శ్రీవిష్ణుతో అల్లూరి సినిమా చేశారు కయాదు. ఆమెకు తెలుగులో తొలి సినిమా ఇది. ఈ ‘అల్లూరి’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో ‘ఫంకీ’ మూవీ చేస్తే, ఇదీ కూడా డిజాస్టర్‌ మూవీనే. మరి..‘ది ప్యార డైజ్‌’తోనైనా, కయాదుకు తెలుగులో ఓ హిట్‌ వస్తుందోమో చూడాలి.

 

Please Share
Share This Article
48 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu