Paramapadha Sopanam Official Trailer: అర్జున్ అంబటి హీరోగా నటించిన సినిమా ‘పరమపద సోపానం’ (Paramapadha Sopanam Official Trailer). జెన్నిఫర్ ఇమ్మాన్యూయేల్, ఈ సిని మాలో హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన, నాగశివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గణపర్తి శ్వేత సమర్పణలో గణపర్తి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది (Paramapadha Sopanam Release date). ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. విడుదలైన, ఈ సినిమా ట్రైలర్‌లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి.
నా కెరీర్‌లోనే, ఇంత బ్రూటల్ మర్డర్ జరిగిన బాడీని, పోస్ట్‌మార్టం చేయడం ఇదే ఫస్ట్‌టైమ్ సార్…
అసలు..ఎవరు ఈ నిందితులు, గవర్నమెంట్ ఉద్యోగులనే టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నారు

ఈ కేసు హ్యాండిల్ చేసినవాడు ఇంకోకడు ఉన్నాడు..అశ్వత్థామ
హీ ఈజ్ ఏ జీనియస్..దీని వెనక ఎవరు ఉన్నా నేను వదలను.
ఫస్ట్ టైమ్ నా గేమ్‌లో ఒక లవ్‌స్టోరీని ఇన్‌వాల్వ్ చేస్తున్నాను…ఐ యామ్ లవ్ విత్ యూ..!
హంతకుడు ముందు నుంచి నాకు కొన్ని క్లూస్ ఇచ్చి, చంపుతున్నాడు…
చావబోయే వాడి ఫింగర్‌ప్రింట్స్..చచ్చిపోయినవాడి బాడీపై దొరుకుతున్నాయి