ఆదర్శకుటుంబం నుంచి అవుట్‌?

Viswa
1 Min Read

Web Stories

Venkatesh AK47 Movie: దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమాలంటే రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా తమన్‌యే సంగీతం అందిస్తున్నాడు. అయి తే తివిక్రమ్‌ (Director Trivikram Srinivas) తాజా సినిమా ‘ఆదర్శకుటుంబం హౌస్‌ నంబరు 47’ (Venkatesh AK47 Movie) కు మాత్రం సంగీత దర్శకుడు హర్షవర్థన్‌ రామేశ్వర్‌ ( Music Director Harshavardhan Rameshwar) ఆన్‌ బోర్డ్‌ అయ్యారు. అసలు..త్రివిక్రమ్‌ సినిమాకు తమన్‌ (Thaman S)కాకుండ, మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంగీతం అందించడం ఏంటి? అనే చర్చ పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో జరిగింది.

దర్శకుడు త్రివిక్రమ్‌తో తనకు ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని, కొంత మ్యూజిక్‌ చేంజోవర్‌ గురించే, ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు తాను దర్శకత్వం వహించడంలేదని తమన్‌ చెప్పుకొచ్చారు. కానీ ఫైనల్‌గా.. అటు తిరిగి ఇటు తిరిగి….త్రివిక్రమ్‌ ‘ఆదర్శకుటుంబం’ సినిమాకు తమన్‌యే సంగీత దర్శకుడిగా ఫిక్స్‌ అయ్యారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి..ఈ గ్యాప్‌లో ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు వెంకటేశ్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఆదర్శకుటుంబం’ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్‌ సాఫ్ట్‌గా ఉన్నప్పటికీని, ఈ సినిమా డార్క్‌ కామేడీ జానర్‌లో ఉంటుందని తెలిసింది.

మరోవైపు ‘యానిమల్‌’ సినిమాకు నేపథ్య సంగీత దర్శకుడిగా హర్షవర్థన్‌ రామేశ్వర్‌ జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ప్రస్తుతం ప్రభాస్‌ ‘స్పిరిట్‌’, పూరీ జగన్నాథ్‌ ‘స్లమ్‌డాగ్‌’ చిత్రాలకు మ్యూజిక్‌ కంపోజింగ్‌ చేయడంలో ఆయన బిజీగా ఉన్నారు.

Please Share
Share This Article
111 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu