Korean Kanakaraju: వరుణ్‌తేజ్ (VarunTej) హీరోగా నటించిన తాజా సినిమా ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju Movie). ఈ సినిమా కొంత రాయలసీమ, మరికొంత కొరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. పెనుగొండకు చెందిన కనకరాజు, కొరియా గ్యాంగ్‌స్టర్… ఇలా రెండు విభిన్నమైన కోణాలు ఉన్న పాత్రలో నటిస్తున్నాడు వరుణ్‌తేజ్. సింపులగా చెప్పాలంటే….రాయలసీమలోని పెనుగొండ వాసి కనకరాజును కొరియాలోని గ్యాంగ్‌స్టర్ భూతం అవహిస్తే ఏం జరు గుతుంది? అన్నదే ఈ ‘కొరియన్ కనకరాజు’ సినిమా మెయిన్ అని విడుదలైన ఈ సినిమా టీజర్ (Korean Kanakaraju Teaser) స్పష్టం చేస్తోంది.ఈ హారర్ ఫాంటసీ కామెడీ యాక్షన్ డ్రామాకు మేర్లపాకగాంధీ దర్శకత్వం వహించారు.
వరుణ్‌తేజ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో హాస్యనటుడు సత్య నటిస్తున్నాడు. హీరోయిన్‌గా రితికా నాయక్ కనిపిస్తారు. కొరియన్ అమ్మాయిగా రితికా నాయక్ నటిస్తున్నట్లు టీజర్ తెలియజేస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ ‘కొరియన్ కనకరాజు’ సినిమా టీజర్‌ను హీరో ప్రభాస్ రిలీజ్ చేసి, చిత్రం యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ ‘కొరియన్ కనక రాజు’ సినిమా ఆగస్టు 7న (Korean Kanakaraju Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.