Rajamouli: ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సూపర్‌హిట్ సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఇందులో మహేశ్ బాబు హీరో. మెక్సికోలో జరుగుతున్న ‘సినీకాన్ ఎక్స్‌పీరియన్స్’ (CCXP MX 2026)ఈ వెంట్‌లో ‘వారణాసి టు ది వరల్డ్’ వీడియోను ప్రదర్శించారు. ‘వారణాసి’ సినిమా నిర్మాతల్లో ఒకరైనఎస్‌ఎస్ కార్తీకేయ ఈ ఈవెంట్‌కు హాజరై, మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో రాజమౌళి వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.
‘‘పాతిక సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నాను. మనం చేసిన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తే, ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను ఎంతగానో మీరు ఆదరిం చారు. ‘నాటు నాటు’ పాటకు భారతదేశంలోని ఇండియన్స్ మాత్రమే కాదు..ప్రపంచం అంతా కాలు కదిపింది. ఈ క్షణం నేను సినిమాలు ఎందుకు తీస్తున్నానో అర్థమైంది. భావోద్వేగాలకు భాషాపరమైన హద్దులు లేవు. భావోద్వేగం, మానవ అనుభూతి అనేవి నా సినిమాలకు పునాదులు. ఇక మెక్సికో నగరం సంస్కృతి, నాగరికతలను గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ, నా ‘బాహుబలి’ సినిమాలో మెక్సికోలోని చిచెన్ ఇట్జా నగరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. వారణాసి సినిమా నా కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్’’ అని చెప్పారు రాజమౌళి (Varanasi Movie director SSRajamouli).
అయితే రాజమౌళి వీడియో సందేశం ప్రదర్శితమౌతున్న సమయంలో, ఆడియన్స్ ఈ వేదికను వదిలి వెళ్లిపోతుండటం, వేదిక వద్ద ఉన్న కుర్చీలు ఖాళీగా కనపడటం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసింది. అలాగే ‘వారణాసి’ మేకింగ్ వీడియోను, ఈ వేడుక సందర్భంగా అభిమానులతో మేకర్స్ పంచుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇది జరగకపోవడంతో, సినిమా ఫ్యాన్స్, మహేశ్‌బాబు ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురయ్యారు.
మహేశ్‌బాబు హీరోగా, ప్రియాంకాచోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్, ప్రకాష్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వారణాసి’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.