KV Thiruvengadam biopic: డాక్టరు కృష్ణావరదాచారి తిరువేంగడం (KV Thiruvengadam) (కేవీ తిరువేంగడం)…ప్రజెంట్ ఈయన గురించే కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే…ఆయన బయోపిక్ సిల్వర్‌స్క్రీన్‌పైకి రాబో తోంది.
అయితే కేవీ తిరువేంగడం జీవితం ఆధారంగా తీయబోయే బయోపిక్‌లో ఎవరు నటించనున్నారనేది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్. ‘జైభీమ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత, హీరో సూర్య– దర్శకుడు టీజే జ్ఞానవేల్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేవీ తిరువేంగడం జీవితం ఆధారంగానే, ఈ సినిమా ఉంటుందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది.
మరోవైపు రజనీకాంత్ హీరోగా అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ సినిమాను కమల్‌హాసన్ నిర్మించనున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 173వ చిత్రం. ఈ సినిమా కథ కూడా కేవీ తిరువేంగడం జీవితం ఆధారంగానే ఉంటుందనే చర్చ చెన్నై టీ–నగర్లో వినిపిస్తోంది.
మరి..ఫైనల్‌గా సిల్వర్‌స్క్రీన్‌పై కేవీ తిరువేంగడం పాత్రగా ఎవరు నటిస్తారు? అనే విషయంపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా సెప్టెంబరులో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. మరోవైపు సూర్య హీరోగా మలయాళ దర్శకుడు జీతూమోహన్దాస్ ఓ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.