రావు బహదూర్‌…ధైర్యం గల యువరాజు

Viswa
1 Min Read

Web Stories

SatyaDev Rao Bahadur Teaser: సత్యదేవ్‌ (satyadev) హీరోగా నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా ‘రావు బహదూర్‌’ (Rao Bahadur Teaser). వికాస్‌ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్‌ భారతి, ప్రణయ్‌ వాక, మాస్టర్‌ కిరణ్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహేశ్‌బాబు, నమ్రతల జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సమర్పణలో అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ ‘రావు బహదూర్‌’ సినిమా జూలై 3న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది (Rao Bahadur Cinema Release date). వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

మూడు నిమిషాల నిడివికిపైనే ఉన్నా, ఈ సినిమా టీజర్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా సత్యదేవ్‌ యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌ కొత్తగా ఉన్నాయి. ఓ డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ను సత్యదేవ్‌ టేకప్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విడుదలైన, ఈ సినిమా టీజర్‌లో ఈ కింది డైలాగ్స్‌ ఉన్నాయి.

రావు బహదూర్‌ అంటే అర్థం తెలుసుకదా మీకు… రావు అంటే ప్రిన్స్‌…బహదూర్‌ అంటే…బ్రేక్‌…
రావు బహదూర్‌ అంటే..ధైర్యంగల యువరాజు అని అర్థం,

నా పేరు రేణుక, నా పేరు రామప్ప….

భయాలు..భ్రమలు..ఊహాలలో విలవిల్లాడుతుంటాడు ఆయన..

నా కథను సినిమాగా తీయాలంటే..కనీసం రెండు భాగాలుగా తీయాలి తెలుసా…

అతను బతకడమే పెద్ద గొప్ప విషయం…తెలుసా..

రావు బహదూర్‌ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాల్లా, ఈ ‘రావు బహదూర్‌’ సినిమాను కూడా ఇతర భాషల ప్రేక్షకులతో పాటుగా, విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునే రితీలో ఉంటుందని సత్యదేవ్‌ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడ్డానని ఈ చిత్రం దర్శకుడు వెంకటేశ్‌ మహా చెప్పారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi