పవన్ తాతా, చమింద వర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘హ్రీం’ (Hreem Movie Teaser). ఈ హారర్ మిస్టికల్ థ్రిల్లర్ సినిమాకు రాజేష్ రావూరి దర్శకత్వం వహిస్తుండగా, సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్రంయూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించగా, దర్శక-నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి ఈ కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి మాట్లాడుతూ-” హీరో పవన్‌కు ఆల్ ది బెస్ట్. హీరోయిన్ చమిందకు మంచి పేరు రావాలి. నిర్మాతగా శివ మరింత పేరు సంపాదించి, మరిన్ని సినిమాలను నిర్మించాలని కోరుకుంటున్నాను. రాజీవ్ కనకాల, తనికెళ్లభరణి వంటి అనుభవజ్ఞులైన యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తూ, మనల్ని భయపెడుతూ ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. దర్శకుడు రాజేష్ ఈ సినిమాతో విజయం అందుకోవాలి. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.”త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా, విజయం సాధించాలని కోరుకుటున్నాను” అన్నారు అచ్చిరెడ్డి.
నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ-”జర్నలిజంలో దాదాపు పాతిక సంవత్సరాలుగా ఉన్న నేను, ఇప్పుడు నిర్మాతగా మీ అందరి ముందుకు వస్తున్నాను. నాకు తండ్రి సమానులైన ప్రభులాంటివారు నాకు సపోర్ట్‌గా నిలిచారు. సినిమా అంటే సమష్టి కృషి. సినిమా నిర్మించే క్రమంలో ఈ సినిమా యూనిట్ అంతా నన్ను ఎంతో ప్రోత్సహించారు. నిర్మాతగా ఎంకరేజ్ చేశారు. రాజేష్ చెప్పిన కథ నచ్చి, ఈ సినిమా చేశాను. పవన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చమిందా దుబాయ్ నుంచి వచ్చి, ఏ రెమ్యూనరేషన్ తీసుకోకుండ ఈ సినిమా చేశారు. రాజీవ్ కనకాల నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. యాక్టర్‌గా పవన్ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న మా టీమ్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
”నాకు దర్శకుడిగా అవకాశం కల్పించిన శివమల్లాలగారికి ధన్యవాదాలు. మా హీరో హీరోయిన్లు బాగా పెర్ఫార్మ్ చేశారు. మా సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు దర్శకుడు రాజేష్.
”మేమంతా మా హ్రీం సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న కథ ఇది. స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ దొరికింది. శివగారిలాంటి నిర్మాత దొరకడం మా లక్” అన్నారు హీరో పవన్ తాతా.
”ఈ హ్రీం సినిమాలో నేనొక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఆడియన్స్‌ను ఈ సినిమా థియేటర్స్‌కు తీసుకువస్తుంది. శివకు ఆల్ ది బెస్ట్”అన్నారు రాజీవ్ కనకాల.
”సినిమా నిర్మాణం అంటే భయపడుతుంటాము. కానీ ఈ సినిమా నిర్మాణంలో మా శివ నష్టపోడన్న ధైర్యం, నమ్మకం నాకు ఉంది” అన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు.
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ రాజ్ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్, నటుడు రాజశేఖర్ , డైరెక్టర్ వరుణ్ రెడ్డి , యాక్టర్ బెనర్జీ , హీరోయిన్ చమింద వర్మ మాట్లాడారు.
