లెనిన్‌ రివ్యూ…వందో భారతంమిట్టలో ఏం జరిగింది?

Viswa
4 Min Read

Web Stories

Akhil Lenin Review: చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురంలో ప్రతి ఏడాది 18 రోజుల పాటు భారతిమిట్టం ఉత్సవాలు జరుగు తుంటాయి. ఈ ఉత్సవాల ఆర్గనైజర్‌ లెనిన్‌ (అక్కినేని అఖిల్‌). అతనొక అనాథ. కానీ శ్రీరామాపురం గ్రామ పెద్దగా ఉండే జయంతమ్మ (ఈశ్వరీరావు) కుటుంబానికి లెనిన్‌ రైట్‌హ్యాండ్‌లా ఉంటాడు. జయంతమ్మ తనయుడు వసంత్‌ (ప్రమోద్‌ పంజు) చెన్నైలో డాక్టర్‌గా చదివి ఊరికి తిరిగొస్తాడు. భారతిమిట్టం ఉత్స వాల్లోనే లెనిన్‌తో ప్రేమలో పడుతుంది భారతి (భాగ్యశ్రీభోర్సే). లెనిన్‌ కూడా భారతిని ఇష్టపడతాడు. కానీ కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వసంత్, భారతిల పెళ్లి నిశ్చయం అవు తుంది. కానీ వసంత్‌తో భారతి పెళ్లికి నిరాకరించి, లెనిన్‌ను పెళ్లి చేసుకుంటుంది. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? వసంత్‌ ఏం చేశాడు? భారతి అక్క వైదేహి ఎలా మాయమైంది? శ్రీరామాపురంలోని కుంటి దామోదరం(బ్రహ్మాజీ), యతిరాజులు (శివాజీ), లోకల్‌ ఎమ్‌ఏల్‌ఏ రాఘవరెడ్డి (రమేష్‌), కడప సెంట్రల్‌ జైలు జైలర్‌ పార్ధసారథీ (సునీల్‌)ల వల్ల లెనిన్‌ జీవితం ఎలా ప్రభావితమైంది? అన్నదే ఈ సినిమా మిగిలిన. థియేటర్స్‌లోనే చూడాలి.

Akkineni Akhil Lenin Movie Review in Telugu
Akkineni Akhil Lenin Movie Review in Telugu

లెనిన్‌ సినిమా కథకు మహాభారతంను ముడిపెట్టి కథనాన్ని మొదలుపెట్టారు. ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ కథ స్టార్ట్‌ అవుతుంది. 1989లో జరిగే విలేజ్‌ డ్రామా స్టోరీ ఇది. భారతంమిట్ట బ్యాగ్రౌండ్‌ స్టోరీ, శ్రీరామాపురంలోని పాత్రల పరిచయం, లెనిన్‌–భారతిల ప్రేమకథలో తొలిభాగం సాదాసీదాగా సాగుతుంటుంది. కానీ ప్రీ ఇంట్రవెల్‌లో వచ్చే ట్విస్ట్, ఇంట్రవెల్‌లో వచ్చే ట్విస్ట్‌ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ఈ ట్విస్ట్‌లు బాగా వర్కౌట్‌ అయ్యాయి. సెకండాఫ్‌లో వసంత్‌ పాత్రతో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్‌లో లెనిన్‌ ట్విస్ట్‌ పర్వాలేదు.

లెనిన్‌ సినిమా చూస్తున్నప్పుడు చాలా సినిమాల్లోని మేజర్‌ సన్నివేశాలు గుర్తుకువస్తుంటాయి. లెనిన్‌ కథకు మహాభారతాన్ని ముడిపెట్టడం సరిగా కుదరలేదు. పైగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది సాధారణ ప్రేక్షకులకు. నా అన్నవాళ్లతో యుద్ధం అన్నది సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌ అయిన ప్పు డు…హీరో పాత్ర తాలుకూ రక్తసంబం« దీకులు ఉంటే… కథలోని ఎమోషన్‌ కు ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు. కానీ హీరో అనాథ అన్నప్పుడు . ..హీరో పాత్రకు ఊర్లోని జనాన్ని ఓ వరుస తో కనెక్ట్‌ చేసిన అది కుత్రిమంగానే ఉంటుంది. తొలిభాగంలో కథకు కీల కంగా చూపించిన వైదేహీ, రాఘవరెడ్డి పాత్రలు సడన్‌గా కథ నుంచి మాయం అవుతాయి. ఇది దర్శకుడు రచనాలోపాన్ని ప్రేక్షులకు గుర్తు చేస్తుంది. దర్శకుడు కథలోని మలుపులపై పెట్టిన శ్రద్ధ….స్క్రీన్‌ ప్లేలో కూడా చూపించినట్లయితే బాగుండేది.

క్లైమాక్స్‌లో హీరో పాత్ర తాలుకూ కెమికల్‌ ట్విస్ట్‌ ఒకటి రివీల్‌ అవుతుంది. కానీ సినిమా స్టార్టింగ్‌లోనే హీరో ఇంట్రడక్షన్‌ విజువల్‌ షాట్స్‌ను బట్టి, ఈ ట్విస్ట్‌ ఆడియన్స్‌కు కొత్తగా ఏమీ అనిపించదు. రెగ్యులర్‌గా సిని మాలు చూసే ఆడియన్స్‌ ఈ ట్విస్ట్‌ను ఇట్టే పసిగెట్టగలరు. అలాగే వందో భారతంమిట్ట అని చెప్పారు. అదే ఊర్లో ఉన్న హీరోని, అదే ఊరి అమ్మాయి హీరోయిన్‌ ఏదో ఫస్ట్‌టైమ్‌ చూస్తున్నట్లు కథలో సీన్స్‌ రాశారు. ఇది నప్పలేదు. క్లైమాక్స్‌ ఒకే. లెనిన్‌ సినిమా కోసం అఖిల్‌ కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. యాక్టింగ్‌ పరంగా అఖిల్‌ను మరో మెట్టు ఎక్కించే సినిమానే ఇది. కాకపోతే కొన్ని చోట్ల వసంత్‌ పాత్ర హీరోను డామినేట్‌ చేసినట్లు అనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌ స్టార్టింగ్‌లో హీరో ప్రస్తావనే లేకుండా వసంత్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూనే సినిమా సాగుతున్నట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో అఖిల్‌ యాక్షన్, ఎమోషనల్‌ సీన్స్‌లో మంచి నటన చూపించాడు. డ్యాన్స్‌లో మునపటికంటే మెరుగైయ్యాడు. కానీ ఇది అక్కినేనిఫ్యాన్స్‌ కాలర్‌ ఏగరేయ్యాలంటే. అయ్యాగారే నెంబర్‌1 కావాలంటే ఇది సరిపోదు. అఖిల్‌ ఇంకాస్త కష్టపడ్డాలి.

ఇక వసంత్‌ పాత్రలో ప్రమోద్‌ (Lenin Movie villain name Pramodh)యాక్టింగ్‌ బాగుంది. సెకండాఫ్‌లో ఈ పాత్ర బలంగా కనపడింది. కానీ క్లైమా క్స్‌లో తేలిపోయింది. ఒక భారతి పాత్రలో భాగ్యశ్రీ బాగా నటించారు. కానీ సెకండాఫ్‌లో ఈ క్యారెక్టర్‌ను ఎందుకో డల్‌ చేశారు. ఉన్నంతలో భాగ్య శ్రీ బాగానే చేసింది. స్క్రీన్‌పై అందంగా కనిపించింది. ఇక గ్రామ పెద్ద జయంతమ్మ పాత్రలో ఈశ్వరీరావు, మరో గ్రామపెద్ద నీలకంఠంగా రాంకీ, కుంటి దామోదరంగా బ్రహ్మాజీ, లోకల్‌ ఎమ్‌ఎల్‌ఏ రాఘవరెడ్డిగా రమేష్‌ ఇందిరా, హీరో ఫ్రెండ్స్‌గా గెటప్‌ శ్రీను, ప్రవీణ్‌ వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. యతి రాజు పాత్రలో శివాజీకి యాక్టింగ్‌ స్కోప్‌ ఉంది. కానీ భారతి పాత్రకు ప్రాధాన్యత తగ్గినట్లే, యతిరాజు పాత్రకు కథలో ప్రధాన్యత సడన్‌గా తగ్గిపోయింది. లెనిన్‌ పాత్రకు బలం చేకూర్చాలని ఇతర పాత్రల పరిమితిని, ప్రాధాన్యాన్ని తగ్గించడంతో…ఆటోమేటిక్‌గా లెనిన్‌ పాత్ర బలం కూడా తగ్గిపోయింది. జైలర్‌ పార్ధసారధిగా సునీల్‌ వల్ల సినిమాకు ఒరిగిన ఉపయోగం ఏమీ లేదు. తమన్‌ మ్యూజిక్‌ ఒకే. ఆర్‌ఆర్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్‌ చేయవచ్చు. లియోన్‌ బ్రిట్టో సినిమాటోగ్రఫీ ,విజువల్స్‌ బాగు న్నాయి.నాగవంశీ,నాగార్జునల నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

Lenin 1st single WWM

యాక్షన్‌ థ్రిల్లర్‌ లవ్‌స్టోరీగా లెనిన్‌ సినిమా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. కానీ మహాభారతం పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో అయితే కాదు.అఖిల్‌ కెరీర్‌కు మాత్రం లెనిన్‌ సినిమా ప్లస్‌ అని చెప్పవచ్చు.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu