Fauzi new Release date: ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి ‘ఫౌజి’ (Fauzi ). ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. కానీ తాజాగా 2026 డిసెంబరు 3న రిలీజ్ చేస్తున్నట్లు వెల్ల డించి, ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్‌పై అజ్ఞాతపర్వ, మోస్ట్ వాంటెండ్ సిన్స్ 1932 అన్నవి కనిపిస్తున్నాయి. అలాగే రెయిన్ ఎఫెక్ట్‌లో ప్రభాస్ ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సోల్జర్‌గా కని పిస్తారని కొందరు, కాదు…అజ్ఞాతంలో బ్రిటిష్ సోల్జర్‌గా పనిచేసే భారత స్వాంతంత్య్ర సమరయోధుడి పాత్రలో కనిపిస్తారు అని కొందరు అంటున్నారు. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఇక ‘ఫౌజి’ సినిమా కథనం హైదరాబాద్‌లో జరిగిన నిజాం కాలంనాటి రజాకర్ల నేపథ్యంతో ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంతో కూడా ఈ సినిమా కథనం కొంత ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా, ఈ సినిమా ప్రధాన కథాంశం అయితే, 1940 కాలమానంలో ఉంటుందని తెలిసింది.
ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ ‘ఫౌజి’ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు (Fauzi cast and crew). శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇస్తున్నారు.నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్‌కుమార్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు