Srinivasa Mangapuram Review: సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేశ్‌బాబు మేనల్లుడు, దివంగత నటుడు–నిర్మాత ఘట్ట మనేని రమేష్‌బాబు తనయుడు ఘట్టమనేని జై కృష్ణ (jai Krishna Ghattamaneni Srinivasa Mangapuram Review )హీరోగా నటించిన తొలి సినిమా ‘శ్రీనివాస మం గాపురం’. ఈ సినిమాతోనే బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాలను తీసిన దర్శకుడు అజయ్‌భూపతి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా జూలై 30న థియేటర్స్‌లో విడుదలైంది. మరి…ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా? రివ్యూలో చదివేద్దాం (Srinivasa Mangapuram Movie Review)
సినిమా : శ్రీనివాసమంగాపురం
ప్రధాన తారాగణం: జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ, మోహన్‌బాబు, వాసుకీ, ‘కిక్’ శ్యామ్, అజయ్
దర్శకత్వం: అజయ్‌భూపతి
నిర్మాతలు: అశ్వనీదత్, పి.కిరణ్
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
కెమెరా: జయకృష్ణ
విడుదల తేదీ:
నిడివి: 2 గంటల 35 నిమిషాలు
రేటింగ్ : 2/5 (Srinivasa Mangapuram movie Review and Rating)
ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
Srinivasa Mangapuram movie story కథ
సొంత ఊర్లోని కాలేజీలో జరిగిన గొడవల కారణంగా చదువుకోవడానికి తిరుపతి వచ్చానని చెప్పి, తిరు పతిలోని సింగర్ బాలు (బ్రహ్మాజీ) ఇంటికి వస్తాడు శ్రీను (జై కృష్ణ ఘట్టమనేని). తిరుపతిలో బాగా పలు కుబడి ఉండి, రౌడీయిజం బ్యాగ్రౌండ్ ఉన్న పెద్దిరెడ్డి (‘కిక్’ శ్యామ్) ఏకైక కుమార్తె మంగ (రాషా తడానీ)ని శ్రీను ప్రేమిస్తాడు. మెల్లిగా మంగకు దగ్గర అవుతాడు శ్రీను. కానీ ఒకరోజు సడన్‌గా..తనకు వివాహం కుది రిందని, తన నిశ్చితార్థానికి రమ్మని చెబుతుంది శ్రీనుకు చెప్తుంది మంగ. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత, మంగకు తన ప్రేమ గురించి చెప్పి, లవ్ ప్రపోజ్ చేస్తాడు శ్రీను. కానీ శ్రీను లవ్‌ను మంగ తిరస్కరిస్తుంది. పైగా తనను మరోసారి కలవొద్దని శ్రీనుకు చెప్తుంది. మరి..ఆ తర్వాత శ్రీను ఏం చేశాడు? మంగ పెళ్లి ఎవరితో జరిగింది? అసలు..శ్రీను బ్యాగ్రౌండ్ ఏంటి? పెద్దిరెడ్డి లైసెన్డ్స్ రివాల్వర్ శ్రీను చేతికి ఎవరు ఇ చ్చారు? అన్న మిగతా విషయాలను సినిమాలోనే చూడాలి (Srinivasa Mangapuram Cinema Review)
విశ్లేషణ
సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని కుటుంబం నుంచి ఒక వారసుడు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడంటే, అతను చేసే సినిమాపై కచ్చితంగా అంచనాలు ఉంటాయి. జైకృష్ణ హీరోగా పరియచం అయిన తొలి సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాపై కూడా ఇలాంటి మంచి అంచనాలే నెలకొన్నాయి. కానీ ఘట్టమనేని అభిమానుల అంచనాలకు తగ్గట్లు దర్శకుడు అజయ్ భూపతి సరైన కథను ఇవ్వలేకపోయారు.తొలిభాగం హీరో పాయింట్ ఆఫ్ లవ్‌స్టోరీ విధానంలో సాగితే, మలిభాగం ప్రీ క్లైమాక్స్ వరకు హీరోయిన్ పాయింట్ ఆఫ్ లవ్‌స్టోరీతో సినిమా సాగుతుంది. ఇలా రెండు లవ్‌స్టోరీస్ చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలగవచ్చు. ఎలాంటే..శర్వానంద్-సాయిపల్లవిల..’పడి పడి లేచే మనసు…’ సినిమా మాదిరి.
ఓ రోటీన్ టెంప్లెట్ యాక్షన్ లవ్‌స్టోరీతో ‘శ్రీనివాసమంగాపురం’ కథను రెడీ చేశారు. హీరోయిన్ గతం మర్చిపోవడం అనే ఓ ఓల్డ్ కాన్సెప్ట్‌తో నేటి తరం ఆడియన్స్‌ను ఎలా మెప్పించాలని అజయ్‌భూపతి అనుకున్నారో ప్రేక్షకు లకు అర్థం కానీ పరిస్థితి. హీరోయిన్‌కు ముందు నత్తి ఉండదు. కానీ తలకు దెబ్బతగిలిన తర్వాత నత్తిగా మాట్లాడుతుంది. తలకు దెబ్బతగిలితే నత్తిగా మాట్లాడటం ఏంటో సామాన్య ప్రేక్షకుడికి ఓ పట్టాన అర్థం కాదు. బళ్లారిలో కూతురు చావుబతుకుల్లో ఉంటే ఇందుకు కారణమైన వాడు ఎవరో కూడా తనకు అక్కర్లే దని అన్న పెద్దిరెడ్డిలాంటి క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా ఊహించు కోమంటే ఎలా? ఇలాంటివి రైటింగ్‌లోని బలహీనతను స్పష్టం చేస్తోంది. పైగా…మహేశ్ బాబు పోకిరి సినిమాలోని రిఫరెన్స్‌లను వాడితే అర్థం చేసు కోలేని ఆడియన్స్ ఇప్పటికాలంలో ఉంటారా? కోటలో ఫైట్ సీక్వెన్స్, ఏం చూసిన నువ్వు గుర్తొస్తున్నావ్ అని హీరోయిన్ చెప్పే డైలాగ్స్ పోకిరి సినిమాను గుర్తు తెస్తాయి. రెగ్యులర్ లవ్‌స్టోరీ సినిమాలు చూసే ఆడియన్స్‌కు ఈ సినిమా కాస్త ఓకే అనిపించవచ్చు. హీరో హీరోయిన్ల స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
శ్రీనివాస్ (శ్రీను, వాసు) పాత్రలో జై కృష్ణ బాగానే చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, భావోద్వేగ సన్నివేశాల్లో ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉంది. తొలి సినిమానే కనుక, భవిష్యత్‌లో ఈ అంశాల్లో కూడా జై కృష్ణ దృష్టి పెడితే, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావొచ్చు. హీరోయిన్‌గా రషా తడానీ (Rasha Thadani) యాక్టింగ్ ఒకే. కొన్ని సీన్స్‌లో గ్లామర్‌గాను కనిపించింది. బళ్లారికి చెందిన వెంక టప్పయ్య నాయుడుగా మోహన్‌బాబు పాత్ర గంభీరమైన డైలాగ్స్ చెప్పడానికి మాత్రమే పరిమితమైంది. పెద్దారెడ్డిగా కిక్ శ్యామ్ ఓ రెగ్యులర్ రోటీన్ ఫాదర్ రోల్ చేశారు. లక్ష్మిపతిగా అజయ్, నారాయణప్పగా వడ్లమాని శ్రీనివాస్ నెగటివ్ రోల్స్‌లో కనిపిస్తారు. స్వతంత్రబాబుగా వీకే నరేశ్, సింగర్ బాలుగా బ్రహ్మాజీ పాత్రలు అనుకున్నట్లుగా వర్కౌట్ కాలేదు.
ఇక దర్శకుడు అజయ్‌భూపతి నుంచి ఈ తరహా రెగ్యులర్ లవ్‌స్టోరీని ఆడియన్స్ ఊహించరు. యాక్షన్ ఎలిమెంట్స్‌పైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కథలో కొత్తదనం లేదు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఒకే. జయకృష్ణ విజువల్స్, ఎడిటింగ్ ఒకే. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
రెగ్యులర్ రోటీన్ యాక్షన్ లవ్‌స్టోరీ సినిమా శ్రీనివాసమంగాపురం. ఒకసారి చూడొచ్చు. కొత్తదనం లేని ప్రేమకథ ఇది. జై కృష్ణకు సరైన లాంచింగ్ అయితే కానే కాదు.

