హీరో వరుణ్‌తేజ్ నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తాజాగా వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju Review) సినిమా ఆగస్టు 7న (Korean Kanakaraju Release date) రిలీజ్ అవుతోంది. హారర్–కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమాకు మేర్లపాకగాంధీ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్లకు ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, ఆగస్టు 6 నుంచే ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు. మరి..ఈ సినిమాతో వరుణ్‌తేజ్ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా? రివ్యూలో చదివేద్దాం (Korean Kanakaraju Review and rating).
సినిమా: కొరియన్కనకరాజు (Korean Kanakaraju Review)
ప్రధానతారాగణం: వరుణ్‌తేజ్, రితికానాయక్, సత్య
దర్శకత్వం: మేర్లపాకగాంధీ
నిర్మాత: రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
సంగీతం: తమన్
కెమెరా: మనోజ్‌రెడ్డి
ఎడిటర్: సత్య జి
విడుదల తేదీ: ఆగస్టు 7, 2026
నిడివి:2 గంటల 45 నిమిషాలు
రేటింగ్:2.5/5 (Korean Kanakaraju Movie Review and rating)
కథ
పెనుగొండలో చెక్కభజన చేసే వ్యక్తి కనకరాజు (వరుణ్‌తేజ్). అక్కడి కియా ఫ్యాక్టరీ ఉద్యోగిని చైత్ర (రితికా నాయక్)ను ఇష్టపడతాడు కనకరాజు . తన స్నేహితుడు–ఫోటోగ్రాఫర్ కిట్టప్ప (హాస్యనటుడు సత్య)తో కలిసి చైత్రను ఫాలో చేస్తాడు కనకరాజు. చైత్రకి కొరియాలో సెటిల్ అవ్వాలని ఆకాంక్ష. మరో వైపు లోకల్ పొలిటిషియన్ చెంగారెడ్డి (సునీల్), చెంగారెడ్డి మేనల్లుడు కర్రీ శ్రీను (టెంపర్ వంశీ)తో కనకరాజుకు గొడవలు జరుగుతుంటాయి. ఓ సారి బార్లో గొడవ జరుగుతుండగా, సడన్‌గా కనకరాజు శరీరంలోకి ఓ కొరియన్ దెయ్యం ఆత్మ వచ్చి చేరుతుంది. అప్ప ట్నుంచి కనకరాజు జీవితమే మారిపోతుంది. కొన్ని పరిస్థితుల కారణంగా కనకరాజు, కిట్టప్ప, చైత్ర కొరియా వెళ్లాల్సి వస్తుంది. మరి..కొరియాలో ఏం జరిగింది? కనకరాజును అవహించిన కొరియన్ ఆత్మ ఎవరిది? ఈ కొరియన్ వ్యక్తిని చంపింది ఎవరు? అన్నది మిగిలిన కథాంశం.
విశ్లేషణ
హారర్ – కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘కొరియన్ కనకరాజు’ అని మేకర్స్ ముందునుంచి చెప్పుకుంటున్నప్పటికీని, ఇందులో యాక్షన్ మోతాదు కూడా కాస్త ఎక్కువగానే ఉంది. హారర్, కామెడీ, యాక్షన్..సమపాళ్లలో రంగరించి, ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో, ఈ చిత్రం దర్శకుడు మేర్లపాక గాంధీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు.

రెగ్యులర్ రోటీన్ లవ్‌స్టోరీతో తొలిభాగం మొదలవుతుంది. ఎప్పుడైతే కనకరాజును కొరియన్ ఆత్మ ఆవ హిస్తుందో, అప్పట్నుంచి ఈ సినిమాలో వేగం పెరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే డాగ్ సీక్వెన్స్–సత్య కామెడీ నవ్విస్తాయి. ఇంట్రవెల్ ట్విస్ట్ కూడా ఫర్వాలేదు. కానీ కొత్తదేం కాదు. సెకండాఫ్ అంతా కొరియో నేపథ్యంలోనే సాగుతుంది. కనకరాజును అవహించిన ఆత్మ ఎవరు? అతని బ్యాక్‌డ్రాప్ ఏమిటి? 21 డేస్ కండీషన్…అంటూ ముందుకు సాగుతుంది. కానీ సెకండాఫ్ గాడి తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు బలవంతంగా ఆడియన్స్‌పై రుద్దినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా బుల్లిరాజు గాజుబొమ్మ సీక్వెన్స్, కొరియాలో ఓ గ్యాంగ్‌స్టర్ మీటింగ్‌లో జరిగే బ్లడ్‌బాత్..ఇదంతా లేకపోయినా…సినిమాకు జరిగే నష్టం ఏమీ లేదు. క్లైమాక్స్ కూడా చాలా పేలవంగా ఉంటుంది.
ఫస్ట్‌హాఫ్‌లో ఏ మాత్రం తెలుగు మాట్లాడని కొరియన్ దెయ్యం, సడన్‌గా సెకండాఫ్ స్టార్టింగ్‌లో తెలుగు మాట్లాడుతుంది. ఓ పెద్ద గ్యాంగ్‌స్టర్‌ను చంపిన వ్యక్తిని కనుక్కోవడానికి సీసీ ఫుటేజీని, అతని గ్యాంగ్ వెతుకుంటే స్క్రీన్ ప్లే అమ్మెచ్యూరెస్గా ఉంటుంది. క్లైమాక్స్‌లో ఆత్మలు స్మశానంలో కోట్లాడు కుంటుంటే, ఈ సన్నివేశాలు సాధారణ మనుషులకు కూడా కనిపించడం, కొరియాకు వెళ్లేందుకు హీరోయిన్ వీసా ఆల్రెడీ రెండుసార్లు రిజెక్ట్ అయ్యిందని సినిమాలో చూపిస్తారు. కానీ హీరో, హీరోయిన్, అతని ఫ్రెండ్, చివర్లో మురళీధర్ గౌడ్…ఏదో పక్క రాష్ట్రానికి వెళ్లినట్లు వెళ్తారు కొరియాకు. ఇక కొరియాలో పోలీస్ వ్యవస్థే లేదా! అన్న రితీలో డ్రామా నడుస్తుంటుంది. ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీగా తీసుకోవాల్సిందే.
పెర్ఫార్మెన్స్
రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో వరుణ్‌తేజ్ కనిపించాడు. కనకరాజు పాత్రలో వరుణ్ యాక్టింగ్ ఒకే. కానీ కొరియన్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించాడు. కానీ ఈ కథకు ఈ రేంజ్ యాక్షన్ అవసరమే లేదు. ఇక ఈ సినిమాకు మరో హీరో సత్య. కిట్టప్ప పాత్ర నుంచి వచ్చిన కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. థియేటర్స్‌లో ఆడియన్స్‌కు కాస్త రిలీఫ్ ఇచ్చే సీన్స్ ఈ పాత్ర నుంచే వస్తాయి. చైత్రగా ఓ రెగ్యులర్ రోటీన్ హీరోయిన్ రోల్ చేసింది. మురళీధర్ గౌడ్ కథకు మలుపు తిప్పేరోల్లో నటించాడు. ఇక సునీల్, టెంపర్ వంశీ ఫస్ట్ హాఫ్ వరకే పరిమితం అయ్యారు. అవసరాల శ్రీనివాస్ ఓ రెగ్యులర్ మిస్టీరియస్ రోల్ చేశాడు.
దర్శకుడు మేర్లపాకగాంధీ ఎంచుకున్న పాయింట్‌ను కాస్త సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. చాలా లాజిక్‌లు మిస్ అయ్యాయి. స్క్రీన్ ప్లే ఫార్మాట్ కూడా రోటీన్‌గా ఉంది. కొరియన్ మెయిన్ విలన్ చావుకు గల కారణం కూడా ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించేలా లేదు. తమన్ సాంగ్ ఒకే. ఆర్ఆర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త చేసి, సినిమాను రెండున్నరలుగా ఆడియన్స్‌కు మరింత గ్రిప్పింగ్టైమ్లో చూపించవచ్చు. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణవిలువలు ఒకే. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఆల్మోస్ట్ ఒకే బిల్డింగ్ లోకేషన్లో జరుగు తున్నట్లు ఉంటుంది.
ఫైనల్‌గా… కొరియన్కనకరాజు అక్కడక్కడ నవ్విస్తాడు. లాజిక్‌లు పక్కన పెడితేనే…!
