కొత్త పోరడొచ్చినాడే…!

Viswa
1 Min Read
Itlu Arjuna Movie Teaser out now

Web Stories

Itllu Arjuna Teaser : అనీష్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఇట్లు అర్జున’ ( Itllu Arjuna Movie). అనస్వరా రాజన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. మహేశ్‌ ఉప్పల దర్శకుడిగా పరిచయం చూస్తూ, దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించిన ఈ తొలి సినిమా అక్టోబరు 30న (Itllu Arjuna Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఈ చిత్రంలో మూగవాడైన అర్జున్‌ పాత్రలో అనీష్‌ నటిస్తుండగా, కీర్తీ పాత్రలో అనస్వర నటించారు. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అనీష్‌ మాట్లాడతూ– ‘‘ఇట్లు అర్జున’ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. యాక్షన్‌ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. ‘‘హీరోగా అనీష్, దర్శకుడిగా మహేశ్, నిర్మాతగా నేను…అంతా కొత్తవాళ్ళం. ఈ సినిమాకు నిర్మాతగా చేయడం వల్ల అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన కలిగింది. దర్శకులు ఒకసారైనా నిర్మాతలుగా మారాలి’’ అని చెప్పారు వెంకీ కుడుమలు. ‘‘తెలుగులో నేను సైన్‌ చేసిన తొలి సినిమా ఇది. కీర్తీ పాత్ర అందరికీ కనెక్ట్‌ అవుతుంది’’ అని చెప్పారు అనస్వరరాజన్‌. ‘కొత్తవాడైన అనీష్‌ బాగా యాక్ట్‌ చేశాడు. కంటెంట్‌ నచ్చితే, ఈ సినిమాను ప్రేక్షకులు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని కోరారు దర్శుకడు మహేశ్‌ ఉప్పాల.

Itlu Arjuna Movie Teaser Launched Event
Itlu Arjuna Movie Teaser Launched Event

‘‘కీర్తీకి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలి…కీర్తిని దగ్గరగా చూడాలా…కీర్తీతో మాట్లాడాలి…ఎలా అవుద్దన్నా…నవ్వు మూగోడివి కదా..’, ‘అర్జున్‌…నువ్వు ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది..చెప్పు అర్జున్‌…’, వంటి డైలాగ్స్‌తో పాటుగా, ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే…అన్న బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా వినిపిస్తుంది ఈ సినిమా టీజర్‌లో….

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu