Mandaadi Movie on OTT: సూరి, సుహాస్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ సూపర్‌హిట్ సినిమా ‘మండాడి’ (Mandaadi Movie) ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మాదిమరన్ పుళగేంది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2026 సెప్టెంబరు 10న థియే టర్స్‌లో విడుదలైన ఈ ‘మండాడి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా, దాదాపు రూ. 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక ఈ ‘మండాడి’ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా, అక్టోబరు 8 (Mandaadi Movie Streaming date) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కళింగపట్నంలోని ఇద్దురు మిత్రులు కాళి (సూరి), సాట్టపులి (సుహాస్) కొన్ని కారణాల వల్ల శత్రువులు అవుతారు. దీంతో కాళి ఊరి వదలిపెట్టి మరోచోట జీవనం సాగిస్తుంటాడు. అయితే మల్లేష్ (మిథున్) కారణంగా కాళి మళ్లీ ఊర్లోకి వస్తాడు. మరి..కాళి, సాట్టపులిలు మిత్రులుగా మళ్లీ కలిసి పోయారా? అసలు.. .వీళ్లు విడిపోవడానికి కారణం ఎవరు? అన్న అంశాలను థియేటర్స్‌లో చూడాలి. ముఖ్యంగా బోట్ రేసింగ్, బోట్ రేసింగ్ నేపథ్యం లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాలో మేజర్ హైలైట్స్‌గా ఉంటాయి.