రణబాలి సినిమాతో విజయ్‌కి హిట్‌ వచ్చిందా?

Viswa
3 Min Read

Web Stories

VijayDevarakonda Ranabaali Review: ‘టాక్సీవాలా’ వంటి డీసెంట్‌ హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా సినిమా ‘రణబాలి’ (Ranabaali Review). పైగా ‘గీతగోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మికామందన్నాలు కలిసి ఈ సినిమా కోసం పనిచేశారు. విజయ్‌–రష్మికల పెళ్లి తర్వాత వచ్చిన తొలి సినిమా ఇది. మరి…‘రణబాలి’ సినిమా విజయం సాధించిందా? రివ్యూ (VijayDevarakonda Ranabaali Review)లో చదివేద్దాం.

కథ

1870 సమయంలో మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రాంతంలో తీవ్రమైన కరువు సంభవిస్తుంది. ఆకలి బాధతో లక్షల్లో ప్రజలు చనిపోతుంటారు. బ్రిటిష్‌ పాలనలో ఉన్న మద్రాస్‌ ప్రెసిడెన్సీ కమిషనర్‌ సర్‌ థియోడర్‌ హెక్టార్‌ (ఆర్నాల్డు వోస్లూ) ఆల్రెడీ బాధల్లో ఉన్న ప్రజలపై ఇంకా అధిక పన్నులు విధిస్తూ, ధాన్యాన్ని పోర్టుల ద్వారా తమదేశానికి తరలిస్తుంటాడు. ఐదులక్షల టన్నుల ధాన్యాన్ని మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి బ్రిటిష్‌ దేశానికి
తరలిస్తే, బాంబే ప్రెసిడెన్సీకి కమిషనర్‌ కావొచ్చు అన్నది సర్‌ థియోడర్‌ హెక్టార్‌ ప్లాన్‌. కానీ సర్‌ థియోడర్‌ హెక్టార్‌కు నేటి రాయలసీమ ప్రాంతంలోని ఓ ప్రదేశానికి పాలెగాడు అయిన శింగనమల బొబ్బిలి రణబాలి అడ్డుపడతాడు. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? రణబాలి జన్మ రహస్యం ఏమిటి? రణబాలి భార్య జయ మ్మకు ఏం జరిగింది? అన్నది సినిమాలో చూడాలి.

విశ్లేషణ

ఇదొక పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా. కొన్ని వాస్తవ సంఘటనలకు కాల్పనికత జోడించి, ఈ సినిమా తీశారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. కథలో కూడా భారీ సెటప్‌ ఉంది. కానీ చెప్పే విధానంలో కొత్తదనం లేదు. ఆకలితో చస్తున్న ప్రాంతంలో ఐదులక్షల టన్నుల ధాన్యం ఎక్కడ్నుంచి వస్తుంది? హీరో ఇంట్రడక్షన్‌ ఫైట్‌లో హీరోకు బాణం గుచ్చుకుంటుంది. ఆ నెక్ట్స్‌ ఫ్రేమ్‌లో కనీసం ఆ గాయం తాలుకూ మచ్చ కూడా ఉండదు. రంగనాయకులు పాత్ర వెనక, అతని కపట లక్ష్యం ఉంది. మరి..సినిమా ప్రారంభంలోనే రణబాలిని చంపాలనుకున్న వ్యక్తి కథ ఏమైంది? ఇలాంటివి ఇంకొన్ని ఉన్నాయి.

VijayDevarakonda Ranabaali Review
VijayDevarakonda Ranabaali Review

హీరో ఎలివేషన్స్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టినప్పుడే, కథపై ఫోకస్‌ తగ్గుతుంది. రష్మిక–విజయ్‌ల సన్నివేశాలు బాగున్నాయి. ఇక ఈ సినిమాకు అజయ్‌–అతుల్‌ ద్వయం అందించిన ఆర్‌ఆర్‌ పెద్ద మైనస్‌. తెలుగు మ్యూజిక్‌ డైరెక్టర్‌ను తీసుకుంటే, ఆ ఇంపాక్ట్‌ను ఇంకాస్త బలంగా చూపించి ఉండొచ్చు ఏమో. భద్రమల్లన్న కథ, క్లైమాక్స్‌ను ముగించిన తీరు బాగున్నాయి. ఈ సినిమా నిడివి, సాగదీత సన్నివేశాలు, ఊహించగలిగిన సన్నివేశాలే తెరపైకి వస్తుండటం అనేవి థియేటర్స్‌లో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేవే.

నటీనటుల పెర్ఫార్మెన్స్

‘రణబాలి’ సినిమాను విజయ్‌ తన భుజాలపై మోసాడు. విజయ్‌ యాక్టింగ్, గుర్రపుస్వారీ చేస్తున్న స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగున్నాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌ లలో కాస్త అతి కనిపించినా, ఎమోషనల్‌ సీన్స్‌లో మెప్పించగలిగాడు. విజయ్‌ కష్టం స్క్రీన్‌పై కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రణబాలి భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన్నా మంచి యాక్టింగ్‌ చేసింది. కానీ ఈ పాత్ర రోటీన్‌గా ఎండ్‌ కావడం మైనస్‌. ఆర్నాల్డ్‌ వోస్లూ తన పాత్రకు న్యాయం చేశాడు. స్క్రీన్‌పై పర్‌ఫెక్ట్‌ విలన్‌గా కనిపించాడు. ఈశ్వరీరావు, రాజా రవీంద్ర, వినోద్‌ సాగర్‌.. వారి వారి పాత్రల మేరకు నటించారు. ఇలాంటి భారీ క్యాన్వాస్‌ తో ఉన్న సినిమాలను తెరకెక్కించే అనుభవం దర్శకుడు రాహుల్‌ ఇంకా రాలేదెమో. నరేషన్, డ్రామాలలో రైటింగ్‌ పదును కనిపించలేదు. ఏందయ్య.. సామీ పాట తప్ప అజయ్‌–అతుల్‌ మ్యూజిక్‌లో ఇంపాక్ట్‌ లేదు. కార్తీక్‌ శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ ఇంకాస్త చేయవచ్చు. నీరవ్‌–జిష్టుల విజువల్స్‌ బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

VijayDevarakonda Ranabaali Review in telugu
VijayDevarakonda Ranabaali Review in telugu
ఫైనల్‌ : యాక్షన్‌ ఎక్కువ..డ్రామా తక్కువ
రేటింగ్‌ 2.25/5
Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu