మాయానది తీరంలో కొరివి దెయ్యం

Viswa
1 Min Read
KORIVI movie title teaser news

Web Stories

Korivi Movie: మాయానది తీరంలో ఉన్న నిధికి కాపుకాసే ఓ దెయ్యం కథగా ‘కొరివి’ సినిమా (Korivi Movie) రాబోతుంది. ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ ఫేమ్‌ దర్శకుడు శ్రీధర్‌ గాదె ఈ సినిమాకు దర్శకుడు. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్‌ ఈశ్వర్‌ రాచిరాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, నందు మురళీధర్, లిఖిత హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్‌ తలారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

Korivi movie title poster

తాజాగా ‘కొరివి’ సినిమా టైటిల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో సాగే హారర్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. ‘ఇది మా తాతలు చెప్పిన కథ, మాయనది తీరంలో ఓ నిధికి కాపు కాసే ఒక దెయ్యం కథ’ అనే డైలాగ్స్‌ ‘కొరివి’ సినిమా టైటిల్‌ టీజర్‌లో ఉన్నాయి. ఈ సినిమాకు సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.

 

Please Share
Share This Article
5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu