Sreeleela in AjithKumar DareDevil: తమిళ హీరో అజిత్‌కుమార్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘డేర్డేవిల్’.

‘డేర్ డేవిల్’ సినిమాలో శ్రీలీల ఓ లీడ్ రోల్ చేయనున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కానీ శ్రీలీల నటించిన తొలి తమిళ చిత్రం శివకార్తికేయన్ ‘పరాశక్తి’ డిజాస్టర్ కావడంతో, ఆ తర్వాత ఆమె ఈ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. డేర్ డేవిల్ సినిమాలో హీరోయిన్ శ్రీలీల సేఫ్‌గా ఉన్నారు.
రామాయణం రిలీజ్…కాజల్ మౌనం వెనుక కారణం ఏంటి?

కానీ అలాంటిది ఏమీ లేదని స్పష్టత వచ్చింది. చెన్నైలో జరిగిన ‘డేర్డేవిల్’ సినిమా ప్రారంభోత్సవంలో శ్రీలీల పాల్గొని, సందడి చేశారు.

శ్రీలీలతో పాటుగా ఈ సినిమాలో సునీల్, మలయాళ నటుడు ఉన్నిముకుందన్, తమిళ నటుడు పార్ధీబన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తారు.

అజిత్ భార్య, నటి శాలిని బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

‘గుడ్బ్యాడ్ అగ్లీ’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో అజిత్‌కుమార్, దర్శకుడు అధిక్రవిచంద్రన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది.