Alpha Movie Teaser: వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న కొత్త సినిమా ‘అల్ఫా’ (Alpha Movie). ఆలియాభట్, శర్వారీ మెయిన్ లీడ్ రోల్స్ చేయగా, బాబీ డియోల్ మరో ప్రధాన పాత్రలో నటించారు. బుధవారం ఆల్ఫా సినిమా టీజర్(Alpha Movie Teaser)ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో ఆలియాభట్, బాబీ డియోల్‌లు తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ఆలియాభట్‌కు 18 సంవత్సరాలు పూర్తి కావడం, ఈ సందర్భంగా ఆలియా భట్ (AliaBhhat) కు బాబీడియోలో ఓ ప్రాజెక్ట్‌ను అప్పజెప్పడం వంటివి టీజర్‌లో కనిపించాయి. తర్వాతి తరానికి చెందిన ఇండియన్ స్పై సోల్జర్స్‌ను బాబీ డియోల్ తయారు చేస్తున్నట్లు, ఇందులో ఒకరిగా ఆలియాభట్ కూడా ఉంటారని విడుదలైన ‘ఆల్ఫా’ టీజర్ స్పష్టం చేస్తోంది.
‘‘నీ బర్త్ డేకి నీ ఫస్ట్ మిషన్‌ను అప్పగిస్తున్నాను. ఇంతకన్నా నీకు గిఫ్ట్ ఇంకేం కావాలి’, ‘ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. తోడేళ్లు ఒకరైతే, గొర్రెలు మరొకరు. నేను తోడేల్ని. మరి..నువ్వు’ ‘తోడేలు కుమార్తె తోడేలే అవుతుంది’ అన్న డైలాగ్స్ ఈ టీజర్‌లో ఉన్నాయి.
శివ్ రావైల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా జూలై 3న (Alpha Movie Release date)రిలీజ్ కానుంది. ఇందులో శర్వారీ, అనిల్ కపూర్‌లు కూడా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే ఆలియాభట్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. శర్వారీ ఇండియన్ స్పై ఏజెంట్‌గా కనిపిస్తారు. శర్వారీ ఉన్నత అధికారిగా అనిల్‌కపూర్, ఆలియాభట్ మెంటర్‌గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ‘వైఆర్‌ఎఫ్’ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన గత చిత్రం ‘వార్ 2’ ఆడియన్స్‌ను ఆశించిన రితిలో ఆకట్టుకోలేదు. దీంతో..‘ఆల్ఫా’ సినిమాపై మాత్రం ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి. ‘వైఆర్‌ఎఫ్’ స్పై యూనివర్స్‌లో మహిళా పాత్రలు ప్రధాన తారాగణంగా ఈ సినిమా వస్తుంది.