ఈ వారం డబ్బింగ్‌ సినిమాలదే జోరు!

Viswa
1 Min Read

Web Stories

scene and Ramayana: అక్టోబరు నెలలో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా ‘జైలర్‌ 2’. రజనీకాంత్‌ చేసిన తమిళ సినిమా ఇది. అక్టోబరులో వెంకటేశ్‌ ‘ఏకే 47’ వంటి పెద్ద సినిమా వచ్చినప్పటికీని, బాక్సాఫీస్‌ పెద్ద పెద్ద ఇంపాక్ట్‌ చూపించలేకపోయింది. ఫ్లాప్‌ దిశగా ఈ సినిమా కలెక్షన్స్‌ నడుస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ చిత్రం ప్రేక్షకులను నిరాశపరచింది. ఇలా అక్టోబరు నెలలో ఒక మంచి హిట్‌ను కూడా తెలుగు సినిమా చూడలేదు .

హీరోయిన్‌ శ్రీలీల సేఫ్‌..డేర్‌డేవిల్‌లో చాన్స్‌

మూడు డబ్బింగ్‌ సినిమాలు

నవంబరు నెల మొదలైంది (November movies). తొలివారంలో నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద రిలీజ్‌కు సిద్ధం అయ్యాయి. తొలివారంలో మూడు డబ్బింగ్‌ సినిమాలు థియేటర్స్‌కు వస్తున్నాయి. హిందీ సినిమా ‘రామాయణ’ తెలుగులో ‘రామాయణం’ (Ramayanam Movie) గా ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేస్తుండగా, సూర్య తమిళ సినిమా ‘సీన్‌’ (Scene Movie) అదే టైటిల్‌తో తెలుగు లోనూ రిలీజ్‌ అవుతోంది. ఎన్వీప్రసాద్, సురేష్‌ ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. నయనతార చేసిన లేటెస్ట్‌ తమిళ సినిమా ‘ముకూత్తి అమ్మన్‌ 2’ తెలుగులో మహాశక్తిగా రిలీజ్‌ అవుతుంది. ఇలా చెప్పుకో వడానికి ఈ వారం మూడు పెద్ద డబ్బింగ్‌ సినిమాలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమా నవంబరు 5న రిలీజ్‌ అవుతుండా, నవంబరు 6న సూర్య ‘సీన్‌’, నయనతార ‘మహాశక్తి’ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి.

తెలుగులో ఒకటే!

తెలుగు నుంచి చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ‘సమ్మర్‌ హాలీడేస్‌’ (Summer Holidays) రిలీజ్‌ కానుంది. బాల నటులు రోహన్‌రాయ్, అరుణ్‌దేవ్, ఖుషి లీడ్‌ రోల్స్‌ చేసిన ఈ సినిమాకు శ్రీకర్‌ డైరెక్టర్‌. ధీరజ్‌ మొగిలినేని నిర్మాత. ఈ సినిమా నవంబరు 6న రిలీజ్‌ అవుతుంది.

Please Share
Share This Article
6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah