ఇట్లు అర్జున మూవీ రివ్యూ…సినిమా హిట్టైందా? లేదా?

Kumar NA
4 Min Read

Web Stories

Aniesh Itllu Arjuna Movie Review: న్యూ గాయ్‌ ఇన్‌ టౌన్‌ అంటు…ఆరు నెలల క్రితం ఇండస్ట్రీలో పెద్ద హడావిడే జరిగింది. మెల్లిగా ఇతను అనీష్‌ రెడ్డిగా తెలిసింది. అనీష్‌రెడ్డికి సినీ బ్యాగ్రౌండ్‌ లేకపోయిన, బిజినెస్‌ బ్యాగ్రౌండ్‌ మాత్రం గట్టిగానే ఉంది. అందుకే ఈ ‘ఇట్లు అర్జున’ సినిమాకు సమర్పకుడిగా నాగార్జున, ఎన్టీఆర్‌ చేతులమీదుగా ట్రైలర్‌ లాంచ్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా రామ్‌చరణ్‌, అఖిల్‌…ఇలా భారీ స్థాయిలో ‘ఇట్లు అర్జున’ సినిమాకు గ్రౌండ్‌ సెట్‌ చేశారు. మరి..ఇంతటి భారీ హంగులతో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా? రివ్యూలో చదివేద్దాం (Itllu Arjuna Movie Review).

సినిమా ఇట్లు అర్జున (Aniesh Itllu Arjuna Movie Review)
ప్రధాన నటీనటులు అనీష్ (తొలి పరిచయం), అనశ్వర రాజన్, ముఖేష్ రిషి, కలైయరసన్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ఎలాంగో కుమారవేల్
దర్శకత్వం మహేశ్‌ ఉప్పల (తొలి పరిచయం)
నిర్మాతలు సమర్పణ నాగార్జున, నిర్మాత వెంకీ కుడుముల
సంగీతం తమన్‌
కెమెరా రాజా మహాదేవన్‌
ఎడిటింగ్‌ కె కోటి
విడుదల తేదీ 13-11-2026
నిడివి 2 గంటల 23 నిమిషాలు
సెన్సార్‌ యూ బై ఏ (16 ఫ్లస్‌)
రేటింగ్‌ 2.75/5

 

కథ

మూగవాడైన అర్జున్‌ (అనీష్‌ రెడ్డి) ఒక దొంగ. అర్జున్‌ నివాసం ఉంటున్న పై ఇంట్లో ఉండే కీర్తీ (అనస్వర రాజన్‌)ని ప్రేమిస్తుంటాడు. కానీ తన ప్రేమను ఆమెకు వ్యక్త పరచడంలో సతమతమవుతుంటాడు. మరోవైపు తన కొడుకు ముని రాజకీయ భవిష్యత్‌ కోసం రూ. 1000 కోట్ల రూపాయాల హవాలా మనీ డీల్‌ సెట్‌ చేసుకుంటాడు పెద్దన్న (ముఖేష్‌ రుషి). ఈ ట్రాన్సాక్షన్‌ తాలుకూ డీటైల్స్‌ ఓ పెన్‌డ్రైవ్‌లో ఉంటాయి. పాస్‌వార్డ్‌ నెలరోజులే పనిచేస్తుంది. అనుకోకుండ రూ.1000 కోట్ల వ్యవహరంలో అర్జున్‌–కీర్తీలు అనుకోకుండ చిక్కుకుంటారు. ఈ రూ. 1000 కోట్ల హవాలా డీల్‌ వ్యవహారంలో పెద్దన్న నమ్మిన బంటు గౌరి (కలైయరసన్‌), పోలీస్‌ ఆఫీసర్‌ హిరానీ (ఎలాంగో కుమారవేల్‌)ల పాత్ర ఏమిటి? తన ప్రేమను అనీష్‌ వ్యక్తపరచి, కీర్తీని దక్కించుకోగలిగాడా? అన్నది మిగిలిన కథాంశం.

సుడిగాలి సుధీర్‌ గోట్‌ మూవీ హిట్టా? ఫట్టా?

విశ్లేషణ

అనీష్‌ రెడ్డికి హీరోగా ఇది తొలి సినిమా. నటుడిగా పరిచయం అవుతున్న తొలి మూవీలోనే మూగవాడైన రోల్‌ చేసి, రిస్క్‌ తీసుకున్నాడు అనీష్‌. లక్‌ ఫేవర్స్‌ బ్రేక్‌ అన్నట్లు…అనీష్‌ చేసిన ఈ రిస్క్‌ ఫేఆఫ్‌ అయ్యింది. రోటిన్‌ కమర్షియల్‌ డ్రామానే అయిన దర్శకుడు మహేశ్‌ ఉప్పల కథను ప్రజెంట్‌ చేసిన తీరు అభినం దనీయం. హీరో పరిచయం, రూ. 1000 కోట్ల హవాలా మనీ వ్యవహారం, కీర్తీ స్వేచ్చను కోరుకునే క్రమంలో బయటకు వెళ్లడం, అనుకోకుండ అర్జున్‌–కీర్తీ క్రైమ్‌లో ఇన్‌వాల్వ్‌ కావడం వంటి సన్నివేశాలతో తొలిభాగం రేసీగా సాగుతుంది. ప్రీ ఇంట్రవెల్‌ సీక్వెన్స్‌ బాగున్నాయి. సెకండాఫ్‌లో కూడా కొన్ని సీన్స్‌ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ సన్నివేశాలను దర్శకుడు బాగా డిజైన్‌ చేసుకున్నాడు. హీరో ప్రేమ హీరోయిన్‌కు అర్థం కావడం, పాస్‌వార్డ్‌ను రివీల్‌ చేసే సీన్, విలన్‌ ఇంటికి హీరో వెల్లడం…వంటి సన్నివేశాలు ఆడియన్స్‌ను అలరించేలా ఉన్నాయి. కానీ సెకండాఫ్‌లో కొన్ని లోటు పాట్లు ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్‌కు ముందు కథ కొంచెం గాడీ తప్పిన ఫీలింగ్‌ కలుగు తుంది. బోరింగ్‌ అనిపించవచ్చు. ఓవరాల్‌ ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

తొలి సినిమాతో అనీష్‌ తన యాక్టింగ్‌తో అలరించాడు. సూపర్‌డెబ్యూ అని చెప్పవచ్చు. యాక్టింగ్, డ్యాన్స్, యాక్షన్, లవ్‌….ఇలా అన్నీ సన్నివేశాల్లో తొలి హీరోగా ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు. కానీ తదుపరి సినిమా కోసం మరింత ప్రిపేర్‌ కావాల్సిన బాధ్యత అనీష్‌పై ఉంటుంది. ఇక ఈ సినిమాలోని కీర్తీ పాత్రలో కూడా అనస్వర యాక్టింగ్‌ బాగానే చేసింది. తెరపై ఈ యంగ్‌ హీరోయిన్‌ గ్లామర్‌ మరో ఏట్రాక్షన్‌. ముకేష్‌ రుషి, కలైయరసన్, ఎలాంగో కుమరవేల్‌ నెగటివ్‌ రోల్స్‌లో ప్రధానమున్న పాత్రలో నటించారు. వెన్నెల కిశోర్‌ కామెడీ బాగుంది. బ్రహ్మాజీ, గెటప్‌ శ్రీను..వంటి వారు వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు. ఇక ఈ సినిమాకు మరో హీరో మాదిరి తెర వెనక వర్క్‌ చేసినట్లు ఉన్నారు తమన్‌. ఈ సినిమాకు తమన్‌ ఇచ్చిన పాటలు, ఆర్‌ఆర్, ఈ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకువెళ్లాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిర్మాతగా వెంకీ కుడుముల నిర్మాణ ప్రమాణాలు రిచ్‌గా ఉన్నాయి. మానసశర్మతో కలిసి దర్శకుడు మహేశ్‌ ఉప్పల మంచి కథ రాశారు. థ్రిల్, కమర్షియల్‌ అంశాల మేళవింపుతో దర్శకుడుగా మహేశ్‌ ఉప్పల సినిమాను బాగా తెరకెక్కించారు. స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ బాగున్నాయి.

బాటమ్‌లైన్‌ – కొత్త కుర్రాడు హిట్టు కోట్టినాడోయ్‌!

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah