సాఫ్ట్‌వేర్‌ టు సినిమా వయా చంద్రయాన్‌

Viswa
2 Min Read

Web Stories

ఇటీవలి కాలంలో తెలంగాణ నేపథ్యంతో ‘బలగం’, ‘పరేషాన్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘క్రేజీ కల్యాణం’ వంటి సినిమాలు వచ్చాయి. ‘ఇడుపు కాయితం’ వంటి చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. తెలంగాణ నేపథ్యం తో వచ్చిన మరో సినిమా ‘చంద్రయాన్‌’. థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభిస్తోంది. శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ‘చంద్ర యాన్‌’ సినిమా రిలీజ్‌ సందర్భంగా దర్శకుడు శ్రీనాథ్‌ చెప్పిన సంగతలు…

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ టు సినిమా డైరెక్టర్‌

దర్శకుడు శ్రీనాథ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ–‘‘సిద్దిపేట దగ్గర హుస్నాబాద్‌ మా స్వస్థలం. చదువుకునే రోజుల్నుంచే సినిమాలంటే చాలా ఆసక్తి. బీటేక్‌ స్టడీ చేస్తున్న రోజుల్లోనే ఛార్మిగారి ‘మంగళ’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ తర్వాత ‘3ఏ లవ్‌’ చిత్రానికి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, మ్యాథ్స్‌ ట్యూటర్‌గానూ పని చేశాను. ఇక సినిమాలపై ఇష్టంతో ఇవన్నీ వదిలేసి ఇండస్ట్రీ వచ్చి, రైటర్‌గా, ఘోస్ట్‌ రైటర్‌గా అనేక సినిమాలతో పాటుగా.. ఈటీవీ, జెమిని, జీటీవీ లోని సీరియల్స్‌ కు పనిచేసాను. దర్శకులు నీలకంఠ, కన్మణి వద్ద పనిచేసాను. సాధారణంగా సినిమా వాళ్లకు ఉండే కష్టాలు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కి ఉండే కష్టాలు స్వయంగా అనుభవించే…దాదాపు పదేళ్లకు పైగానే సినీ పరిశ్రమలో పనిచేసి ఇప్పుడు ‘చంద్రయాన్‌’ చిత్రంతో దర్శకుడిని అయ్యాను’’ అని తెలిపారు.

Chandrayan movie director Srinath Chandrashekhar Special interview

చంద్రయాన్‌ ప్రయాణం ఎలా మొదలైందంటే…!

చంద్రయాన్‌ సినిమా గురించి మాట్లాడుతూ.. ఊళ్ళో ఉన్నప్పుడే ఈ ఆలోచన వచ్చింది. ప్రేమించిన అమ్మాయి ఎవరెవరితోనో పోలుస్తూ నువ్వేమి చేయలేవా అంటే రాకెట్‌ తయారుచేసి చంద్రుడి మీదకు వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ కథని రాసుకున్నాను. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌ లో ఊళ్ళల్లో ఉండే కుర్రాళ్ళు, వారి మధ్య కామెడీతో, ఊళ్ళల్లోని జనాలు, ప్రేమ, చంద్రుడి మీదకు రాకెట్‌ ప్రయోగం.. వంటి అంశాలతో ఈ కథని రాసుకున్నాను. సినిమా తెరకెక్కించేటప్పుడు రియల్‌ లొకేష¯Œ ్స కావడంతో మొదటి సినిమాకు చాలానే కష్టాలు పడ్డాను. సినిమా అయ్యాక దర్శకుడు వేణు ఉడుగుల గారు మా సినిమా చూసి నచ్చడంతో ఆయనే రిలీజ్‌ చేస్తామని ముందుకు వచ్చారు. నా మొదటి సినిమానే ఆయన రిలీజ్‌ చేయడం నాకు ఆనందంగా ఉంది అని అన్నారు.

త్వరలోనే నెక్ట్స్‌ సినిమా!

నా దగ్గర ఆల్రెడీ కొన్ని కథలు ఉన్నాయి. కొంతమంది హీరోలకు నరేషన్స్‌ ఇచ్చాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. నా నెక్ట్స్‌ సినిమా ఒకే కాగానే, ప్రకటిస్తాను. తెలంగాణ సంస్కృతిని చూపిస్తూనే, వినోదాత్మక సినిమాలు చేయాలన్నది నా ఆకాంక్ష.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah