NTR And Trivikram God of war Movie: ఎన్టీఆర్ (NTR) –త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లోని కొత్త సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’ (వర్కింగ్ టైటిల్) గురించి గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో విభిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలోని గత చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం 47’ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), త్రివిక్రమ్‌ల మధ్య స్నేహానికి బీటలు వారాయనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపించాయి. దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా చేయాల్సిన మైథాలజికల్ డ్రామా ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీకి చినబాబు నిర్మాతగా ఉండటం లేదని, దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా ఇకపై ఉండదనే ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలు ఇంతటితో ఆగలేదు. ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా ఆగిపోయిన నేపథ్యంలో డీవీవీ దానయ్య బ్యానర్లో త్రివిక్రమ్ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా ఓ సినిమా రానుందనే ప్రచారం జోరందుకుంది. ‘గాడ్ ఆఫ్ వార్’ (God of war Movie) సినిమా ఆగిపోవడంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కాస్త డీలా పడ్డారు.
సుడిగాలి సుధీర్ గోట్ మూవీ హిట్టా? ఫట్టా?
కానీ ఊహాగానాలకు, వదంతులకు చెక్ పెట్టేలా, ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా ఆగిపోలేదని, ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమా ఉంటుందని ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ (NTRxTrivikram) . ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అంటే….వచ్చే వేసవి తర్వాత ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా నిర్మాణంలో తొలుత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ మాత్రమే ఉంటుందన్నట్లుగా ప్రకటన వచ్చింది. తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇలా… చినబాబు బడ్జెట్ భారాన్ని కొంతవరకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా పనులు ఆగిపోలేదనే వార్త మాత్రం ఎన్టీఆర్ అభిమానులను సంతోషపరచే విషయమనే చెప్పాలి.
ఇట్లు అర్జున మూవీ రివ్యూ…సినిమా హిట్టైందా? లేదా?
ఇక గతంలో ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేతవీరరాఘవ’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లోనే మరో మూవీకి ప్రకటన వచ్చినా, ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా విషయంలో మాత్రం ఇలాంటి తప్పు రిపీట్ అయ్యే చాన్స్ లేదని తెలుస్తోంది.