Varanasi Release Postponed: రాజమౌళి విజన్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ విజన్ స్క్రీన్‌పై అనుకున్నది అనుకున్నట్లుగా కనిపించడానికి చాలా సమయమే పడుతుంది. అందుకెనేమో…రాజమౌళి (Director Rajamouli) దర్శకత్వంలోని ఏ సినిమా రిలీజ్ కూడా అను కున్న సమయానికి రిలీజ్ కాలేదు.
అయితే రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’ సినిమా మాత్రం, ఇందుకు మినహాయింపుగా ఉంటుందని, మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న అడ్వెం చరస్ అండ్ మైథాలజీ యాక్షన్ డ్రామా ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుందని అందరు అనుకున్నారు. ఇదే విషయాన్ని ‘వారణాసి’ టీమ్ కూడా చెబుతూ వస్తోంది.
ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
కానీ ‘వారణాసి’ సినిమా (Varanasi Movie) రిలీజ్ డేట్‌పై మరోసారి అనుమానాలు మొదలైయ్యాయి. ‘వారణాసి’ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాదనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ భారీ స్థాయిలో పెండింగ్ ఉండటం, రామాయణ ఎపిసోడ్‌ను మరింత ఏఫెక్టివ్‌గా ఉండేలా చేయాలను కోవడం వంటి కారణాల చేత ‘వారణాసి’ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ‘వారణాసి’ సినిమా ఎస్‌ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మించారు. షూటింగ్ పూర్తయింది. ఇక కాలాతీతంగా ఖండాలను సైతం టైమ్ ట్రావెల్ చేయగల ఓ సాహసీకుడి యాత్ర నేపథ్యంతో ఈ ‘వారణాసి’ సినిమా కథనం సాగుతుందని తెలి సింది.