ENE Repeat Review: ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా 2018లో విడుదలై, ఆడియన్స్‌ను అలరించింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చింది. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్లోనూ యూత్ ఆడియన్స్ మెప్పు పొందింది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన తరుణ్భాస్కర్నే ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat Cinema) సినిమాను తీశాడు. సుశాంత్ ప్లేస్‌లో శ్రీనాథ్ మాగంటి టీమ్‌లో చేరగా, తెలుగు అమ్మాయి శివాత్మిక రాజశేఖర్ న్యూ జాయినింగ్ అన్నమాట లీడ్ క్యార్టెర్స్లో. మరి..ఈఎన్ఈ రిపీట్ (ENE Repeat Review) సినిమా ఆడియన్స్‌ను ఏమాత్రం మెప్పించగలిగింది? అన్నది చూద్దాం.
| సినిమా | ఈఎన్ఈ రిపీట్ |
| ప్రధాన తారాగణం | విశ్వక్సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాంగటి, వెంకటేష్ కాకుమాను, శివాత్మిక రాజశేఖర్, ప్రియదర్శని రామ్ |
| రచన–దర్శకత్వం | తరుణ్‌భాస్కర్ |
| నిర్మాతలు | సృజన్ యెర్రబోలు, సందీప్ నాగిరెడ్డి |
| సంగీతం | వివేక్ సాగర్ |
| కెమెరా | ఏజే ఆరోన్ |
| ఎడిటింగ్ | రవితేజ గిరిజాల |
| నిడివి | 2 గంటల 43 నిమిషాలు |
| సెన్సార్ | యూ బై ఏ (16 ఫ్లస్) |
| విడుదల తేదీ | 19–11–2026 |
| రేటింగ్ | 2.75/5 |
కథ
వివేక్ (విశ్వక్సేన్), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకు మాను) స్నేహితులు. సినిమా ఇండస్ట్రీలో మంచి కెరీర్ కోసం కష్టపడుతుంటారు. వివేక్ డైరెక్టర్, కార్తీక్ సినిమాటోగ్రాఫర్, కౌశిక్ యాక్టర్, ఉపేంద్ర ఎడిటర్. వీరందరూ కలిసి తీసిన ఓ సినిమా ఫ్లాప్ అవుతుంది. దీంతో ఆ సినిమా అప్పులు తీర్చే బాధ్యత వివేక్‌పై పడుతుంది. కార్తీక్, కౌశిక్, ఉపేంద్ర..వాళ్ల పనులు వారు చేస్తుంటారు. అయితే తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే కీర్తీనని ప్రేమిస్తాడు కార్తీక్. తన లవ్ మ్యాటర్ ను కీర్తనకు చెప్పేలోపే, కీర్తన పెళ్లి అంకిత్ (శ్రీరామ్)తో ఫిక్స్ అవుతుంది. కానీ కీర్తీన విషయంలో అంకిత్, కార్తీక్‌కు గొడవ అవుతుంది. దీంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. దీంతో కీర్తీన తండ్రి, ప్రముఖ డాక్టర్ మురళీధర్ (ప్రియదర్శి రామ్) కోపగించుకుంటారు. ట్యాలెంట్ ఉంటే మంచి హిట్ తీయాలని? లేని పక్షంలో సినిమా వదిలేయాలని వివేక్ అండ్ గ్యాంగ్‌కి చాలెంజ్ చేస్తాడు? మరి…ఆ తర్వాత జరిగింది? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ
ఇదెదో పెద్ద డ్రామా కాదు. సస్పెన్స్..థ్రిల్..మిస్టరీ..హారర్ గట్రా లేవు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఫైట్స్ కూడా లేవు. సాంగ్స్ కూడా తక్కువే. ఇవన్నీ లేకుండా ఆడియన్స్‌ను రెండున్నర గంటలు థియేటర్స్‌లో కూర్చొబెట్టగల జెన్‌జీ స్టప్ను సినిమాలో చూపించారు దర్శకుడు తరుణ్‌భాస్కర్. వన్‌లైనర్స్, స్పూప్ పంచ్‌లు…ముఖ్యంగా కామెడీతో ఆడియన్స్ బోర్ ఫీలవ్వకుండ చేయగలిగారు దర్శకుడు తరుణ్‌భాస్కర్.

సినిమాలో సినిమా అంటూనే..ఫ్రెండ్షిప్, బాధ్యత, మహిళల సాధికారిత వంటి అంశాలను అంతర్లీనంగా టచ్ చేస్తూ మంచి ఎంటర్టైనింగ్ సినిమా తీశారు. సినిమా ప్రారంభంలో, సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో కాస్త స్లో అనిచించిన, అది నవ్వుకి, నవ్వుకి మధ్య వచ్చిన ఓ బ్రేక్‌గా భావించవచ్చు. ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే పబ్సీన్, సెకండాఫ్ హాఫ్‌లో వచ్చే జంగిల్ సీన్ ఆడియన్స్‌ని కడుపుబ్బ నవ్విస్తాయి. రెగ్యులర్‌గా సినిమాలు చూసే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే, యూత్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఇంకాస్త ఎంటర్టైన్ చేస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
వివేక్‌గా విశ్వక్ ఓ సెటిల్డ్ క్యారెక్టర్ చేశాడు. కౌశిక్‌గా అభినవ్ గోమఠం ఈ సినిమాలో రెచ్చిపోయారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథకు లీడ్‌గా నిలిచారు. కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి యాక్టింగ్ఒకే. స్టోరీ మేజర్ కాన్ఫ్లిక్ట్ ఈ రోల్‌తోనే ముడిపడి ఉంటుంది. ఉపేంద్రగా వెంకటేశ్ కాకుమాను యాక్టింగ్ ఫర్వాలేదు. నాగదేవతల రివెంజ్ ఎడిటింగ్ సీన్లో భలే నవ్వించాడు. కీర్తీన పాత్రలో శివాత్మక ఒకే. ఈ పాత్ర చుట్టూ మరికొంత ఎమోషనల్ డ్రామాను డైరెక్టర్ బిల్డప్ చేసి ఉంటే మరింత బాగుండేది. హీరోయిన్ తండ్రిగా ప్రియదర్శిని రామ్, ఉపేంద్ర పాత్ర ఫాదర్‌గా కరుణకుమార్, మేనేజర్‌గా సింజిత్ యెర్రమిల్లి, ప్రొడ్యూసర్ రాబిన్‌గా రమేష్,అనీషా అంబ్రోస్ వారి వారి పాత్రల పరిధిమేర యాక్టింగ్ చేశారు. దర్శకుడు అనిల్‌రావిపూడి, సందీప్ రెడ్డివంగా, నందినీ రెడ్డి గెస్ట్ రోల్స్ చేశారు. వివేక్ సాగర్ మ్యూజిక్ బాగుంది. బతుకమ్మ పాట, సెకండాఫ్ లో మిథ్యా సాంగ్ బాగున్నాయి. ఆర్ఆర్ ఒకే. నిర్మాన విలువలు ఒకే.
బాటమ్‌లైన్: యూత్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుంది. కంప్లీట్ జెన్ జీ స్టప్. ప్యూర్ ఎంటర్టైన్మెంట్.