రష్మికా మందన్నా లీడ్ రోల్ చేసిన మరో ఉమెన్‌సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘మైసా’. ‘అర్థ శతాబ్ధం’ సినిమా ఫేమ్ రవీంద్ర పుల్లే (mysaa movie director Rawindra Pulle) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మించింది. ఈ నెల 27న (mysaa movie release date) సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ సడన్‌గా ‘మైసా’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు.
కొత్త సెన్సార్ రూల్స్ అమలులోకి వచ్చాయి. దీంతో రూల్స్ ప్రకారం ‘మైసా’ సెన్సార్‌కు కొంత సమయం పడుతుంది. దీంతో ‘మైసా’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు అని కొందరు అంటుంటే…లేదు…పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల ‘మైసా’ సినిమా విడుదల వాయిదా పడందని మరికొందరు చెప్తున్నారు. ‘మైసా’ ఫస్ట్‌కాపీ చూసుకున్న రష్మికమందన్నా కొన్ని మార్పులు చేర్పులు సూచించారని, కొంత రీషూట్స్ చేయాల్సి ఉన్నందున ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అసలు.. విషయం పూర్తి స్థాయిలో బయటకు రాకపోయిన ‘మైసా’ సినిమా రిలీజ్ మాత్రం వాయిదా పడింది.నిజానికి ‘మైసా’ సినిమా రిలీజ్‌ను ఈ దీపావళికే అనుకున్నా రు. కానీ ‘మైసా’ టైటిల్ సాంగ్ చిత్రీకరణ సమయంలో రష్మిక గాయపడ్డారు. ఫలితంగా ‘మైసా’ సినిమా రిలీజ్ నవంబరు 27కి వాయిదా పడింది.
కానీ ఇప్పుడు ‘మైసా’ సినిమా రిలీజ్ ఎప్పుడు? అన్నదే అసలు ప్రశ్న. రిలీజ్ వాయిదా పడిన, తమ సినిమాను థియేటర్స్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదని ‘మైసా’ టీమ్ ఆల్రెడీ చెప్పేసింది. అంటే…‘మైసా’ మూవీ డిసెంబరులో రిలీజ్ కానుందా? అనే డౌట్స్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
డిసెంబరు తొలివారంలో అయితే నాగచైతన్య ‘వృషకర్మ’, సల్మాన్‌ఖాన్ ‘మాతృభూమి’, శ్రద్ధాకపూర్ ‘ఈత’ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. సో..డేట్‌కు ‘మైసా’ వచ్చే పరిస్థితి లేదు. క్రిస్మస్ సందర్భంగా బాల కృష్ణ ‘దాదా’, షారుక్‌ఖాన్ ‘కింగ్’ సినిమాలు ఉన్నాయి. ఈ టైమ్ కుదరదు. సంక్రాంతి సీజన్ ఇప్పటికే ఫుల్ ప్యాక్డ్. ఈ సమీకరణాల నేపథ్యంతో ‘మైసా’ సినిమా విడుదల డిసెంబరు 11న (mysaa movie release date) ఉండొచ్చు. లేదంటే. .ఫిబ్రవరికి షిఫ్ట్ కాక తప్పదు.