శర్వాకు లక్కీచాన్స్‌

Kumar NA
1 Min Read

Web Stories

Sharwanand Bhogi solo release: హీరో శర్వానంద్‌ మాములు లక్కీ కాదు. ప్రతిశుక్రవారం కనీసం రెండు ప్రాఫర్‌ సినిమాలు తెలుగులో విడుదల అవుతున్నాయి. అలాంటిది శర్వానంద్‌ ‘భోగి’ సినిమాకు ఆల్మోస్ట్‌ సోలో రిలీజ్‌ చాన్స్‌ లభించింది (Sharwanand Bhogi latest news).

‘భోగి’ (Sampath Nandi Sharwanand Bhogi) సినిమాను తొలుత నవంబరు 12న రిలీజ్‌ చేద్దామనుకున్నారు. ఆ రోజు తెలుగులో పదికిపై సినిమాలు విడుదల అయ్యాయి. కానీ సెన్సార్‌ ఇబ్బందుల వల్ల ‘భోగి’ సినిమా విడుదల కాలేదు. దీంతో ‘భోగి’ సినిమా డిసెంబరులో రిలీజ్‌ అవుతుందన్న ప్రచారం జరిగింది. కానీ ‘భోగి’ యూనిట్‌ నవంబరు 27న (Bhogi movie release date) రిలీజ్‌ అంటు కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది.

అప్పటికే నవంబరు 27న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ‘హైంధవ’, రష్మికా మందన్నా ‘మైసా’ వంటి సిని మాలు రిలీజ్‌కు షెడ్యూల్‌ అయ్యాయి. కానీ సడన్‌గా ‘హైందవ’, ‘మైసా’ సినిమాల రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో ‘భోగి’కి సోలో రిలీజ్‌ అన్న లక్కీచాన్స్‌ లభించింది. నవంబరు 27నే ‘ఆలోచన’, ‘హై’, ‘బాల 369’ వంటి సినిమాలూ ఉన్నా, ఆడియన్స్‌ దృష్టి అంతా కూడా శర్వానంద్‌ ‘భోగి’ సినిమాపై ఉంది. మరి…ఈ చాన్స్‌ను శర్వానంద్‌ ఎంతమేరకు యూటిలైజ్‌ చేసుకుంటారో చూడాలి (Bhogi solo release advantage).

శర్వానంద్‌ హీరోగా సంపత్‌నంది డైరెక్షన్‌లో రూపొందిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘భోగి’ని కేకే రాధామోహన్‌ నిర్మించారు. అనుపమా పరమే శ్వరన్, డింపుల్‌ హయాతి హీరోయిన్స్‌. ఇందులో ఐదుగురు ఉన్న గంగన్న పాత్రలో శర్వానంద్‌ నటించారు. 1960 నేపథ్యంతో మహారాష్ట్ర – తెలంగాణ (అదిలాబాద్‌) సరిహద్దు ప్రాంతాల్లో బొగ్గులగుంట అనే కల్పిత గ్రామంలో జరిగే కథే ‘భోగి’ సినిమా. మూఢ నమ్మకాలు, పెత్తందారి వ్యవస్థ, బానిసత్వం, అణగారిన వర్గాల పోరాటం వంటి అంశాల నేపథ్యంతో ‘భోగి’ సినిమా కథనం సాగుతుంది.

Please Share
Share This Article
Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah